Jeevan Reddy | ఏమైనా కేసీఆర్‌ను ఆడిపోసుకోవడం.. కేసీఆర్‌ను ఆడిపోసుకుంటేనే నువ్వు ఇక్కడిదాకా వచ్చినవ్ అని సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ఓ ఈవెంట్ సందర్భంగా తనను తాను హిట్లర్‌తో పోల్చుకుంటూ చేసిన కామెంట్స్‌పై రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. హిట్లర్ గతి ఏమైందో చివరికి అందరం గమనించినం. రేపు రేవంత్ రెడ్డికి కూడా అదే గతి పడ్తది. ప్రజాస్వామ్యంలో హిట్లర్‌గా ఉండాలని కోరుకునేటోడు ఎవరుండరని నేనంటున్నా. హిట్లర్ కావాలని ఎవరు కోరుకోరన్నారు.
ఒక కాంగ్రెస్ నాయకుడిగా ఏం కావాలని కోరుకోవాలి.. ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకోవాలి. రాజీవ్ గాంధీని ఆదర్శంగా తీసుకోవాలి.. పండిట్ జవహర్ లాల్ నెహ్రూను ఆదర్శంగా తీసుకోవాలి. ఎవడన్నా హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకుంటాడా..అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ది మోస్ట్ నొటోరియస్ క్రిమినల్ ఎవడంటే హిట్లర్. ఇవాళ రేవంత్ రెడ్డి ఆయనకు ఆయననే ఎవరితో పోల్చుకుంటున్నడు.. వరల్డ్ మోస్ట్ నొటోరియస్ క్రిమినల్‌తో పోల్చుకుంటున్నడు. దీన్ని బట్టే ఆయన ఎలాంటి పాలన కొనసాగిస్తుండో అర్థం చేసుకోవచ్చన్నారు.
రేవంత్ రెడ్డి నీకు కూడా హిట్లర్‌కు పట్టిన గతే పడుతది
– జీవన్ రెడ్డి pic.twitter.com/6oa3pLxv6G
— Telugu Scribe (@TeluguScribe) June 10, 2026
అన్ని రంగాల్లో నల్లగొండను అభివృద్ధి పరిచేందుకు కృషి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
Gorilla’s Reaction | గర్ల్ ఫ్రెండ్‌తో గొడవ.. అచ్చం మనిషిలాగే బాధపడుతున్న మగ గొరిల్లా.. Video viral