నల్లగొండ : రాష్ట్రంలోని రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయి. తాజాగా ఎగువన కురుస్తున్న వర్షాలతో నాగార్జున సాగర్(Nagarjuna Sagar) ప్రాజెక్టుకు వరద(Flood) ప్రవాహం కొనసాగుతున్నది. దీంతో అధికారలు 22 క్రస్ట్ గేట్స్ ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్‌కు ఇన్ ఫ్లో 2,08,863 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 2,25,463 క్యూసెక్కులుగా ఉంది. సాగర్ ప్రస్తుత నీటి మట్టం 589.70 అడుగులు కాగా, పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను
ప్రస్తుతం 311.4886 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేయడంతో సాగర్ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
Lucky Baskhar | ప్రతీ అభిమాని కాలర్ ఎగరేస్తారు.. దుల్కర్ సల్మాన్ లక్కీభాస్కర్పై వెంకీ అట్లూరి
Zebra | సత్యదేవ్ జీబ్రా దీపావళికి రావడం లేదు.. ఎందుకో మరి..?