న్యూశాయంపేట, ఫిబ్రవరి 20: దీర్ఘకాలిక నొప్పులతో బాధపడుతున్న రోగులకు ప్రత్యేక చికిత్సలు అందించేందుకు మెడికవర్ హాస్పిటల్లో ‘అడ్వాన్స్డ్ పెయిన్ మేనేజ్మెంట్’ క్లినిక్‌ను ప్రారంభించారు. వెన్ను నొప్పి, నరాల నొప్పి, మోకాళ్లప్పి, క్యాన్సర్‌కు సంబంధించిన నొప్పులతో బాధపడుతున్నవారికి ఈ క్లినిక్‌లో ప్రత్యేక వైద్యం అందిస్తామని క్లినిక్ స్పెషలిస్ట్ పెయిన్ ఫిజిషియన్ డాక్టర్ వాసు ప్రకాష్, కన్సల్టెంట్ క్రిటికల్‌కేర్ వైద్యులు దీపక్ తెలిపారు.
ప్రతి రోగిని సమగ్రంగా పరిశీలించి, వారి పరిస్థితికి అనుగుణంగా వ్యక్తిగతీకరించిన చికిత్స ప్రణాళికను రూపొందిస్తామని, అవసరమైతే సంబంధిత స్పెషాలిటీ విభాగాల సహకారంతో చికిత్స చేస్తామని క్లినిక్ స్పెషలిస్ట్ పెయిన్ ఫిజిషియన్ డాక్టర్ వాసు ప్రకాష్, కన్సల్టెంట్ క్రిటికల్‌కేర్ వైద్యులు దీపక్ తెలిపారు. ఈ క్లినిక్ లో తీవ్రమైన వెన్ను నప్పి, చేతులు లేదా కాళ్లకు వ్యాపించే నరాల నొప్పి, వెన్నెముక సమస్యల వల్ల సంభవించే.. మొద్దుబారడం లేదా బలహీనత, దీర్ఘకాలిక మోకాళ్ల నొప్పి, క్యాన్సర్‌కు సంబంధించిన నొప్పులకు చికిత్స అందిస్తాని చెప్పారు.
క్యాన్సర్ నొప్పితో బాధపడుతున్న రోగుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి పెయిన్, ప్యాలియేటివ్ మెడిసిన్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయని వారు వెల్లడించారు. శస్త్రచికిత్సకు అనుకూలం కానీ రోగులు, శస్త్రచికిత్స చేయించు కోవాలనుకునేవారు, ఇప్పటికే శస్త్రచికిత్స చేయించుకున్నా నొప్పితో బాధపడుతున్నవారు, క్యాన్సర్ నొప్పికి సహాయక చికిత్స అవసరమైన రోగులకు ఈ సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ క్లినిక్‌లో అడ్వాన్స్డ్ నాన్-సర్జికల్, మినిమల్లీ ఇన్వేసివ్ విధానాలు, ముఖ్యంగా రేడియోఫ్రీక్వెన్సీ ఆబ్లేషన్ వంటి ఆధునిక చికిత్సలు, సమగ్ర పెయిన్ మేనేజ్మెంట్లో భాగంగా అందిస్తామని క్లినిక్ స్పెషలిస్ట్ పెయిన్ ఫిజిషియన్ డాక్టర్ వాసు ప్రకాష్, కన్సల్టెంట్ క్రిటికల్‌కేర్ వైద్యులు దీపక్ తెలిపారు.