AUS vs OMAN | మార్ష్, హెడ్ వీరబాదుడు.. లీగ్ దశలో ఆఖరి పంచ్ ఆస్ట్రేలియాదే..!
AUS vs OMAN : చివరి లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గర్జించింది. నాకౌట్ బెర్తు చేజారిన బాధను దిగమింగుతూ ఒమన్‌పై పంజా విసిరింది. మిచెల్ మార్ష్(64 నాటౌట్), ట్రావిస్ హెడ్(32)లు ప్రత్యర్ధి బౌలర్లపై నిర్ధాక్షిణ్యంగా విరుచుకుపడ్డారు.
AUS vs OMAN : చివరి లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గర్జించింది. నాకౌట్ బెర్తు చేజారిన బాధను దిగమింగుతూ ఒమన్‌పై పంజా విసిరింది. స్పల్ప ఛేదనలో మిచెల్ మార్ష్(64 నాటౌట్), ట్రావిస్ హెడ్(32)లు ప్రత్యర్ధి బౌలర్లపై నిర్ధాక్షిణ్యంగా విరుచుకుపడ్డారు. వీరిద్దరూ ఎడాపెడా బౌండరీల మోత మోగించగా ఆసీస్ వడివడిగా లక్ష్యాన్ని కరిగించింది. హెడ్ ఔటయ్యాక.. ఓష్ ఇంగ్లిస్(12 నాటౌట్) రెండు ఫోర్లతో జట్టును గెలిపించాడు. పదో ఓవర్లోనే లక్ష్యాన్ని అందుకున్న కంగారూ టీమ్ రెండో విజయంతో గ్రూప్ బీలో మూడో స్థానానికి ఎగబాకింది.
గ్రూప్ దశలోనే ప్రపంచకప్ నుంచి నిష్క్రమించిన ఆస్ట్రేలియా చివరి పోరులో చెలరేగిపోయింది. పసికూన ఒమన్‌ను వణికిస్తూ 9 వికెట్లతో ఘన విజయం సాధించింది. స్పల్ప ఛేదనలో ఓపెనర్ మిచెల్ మార్ష్(64 నాటౌట్) తొలి ఓవర్లోనే మూడు ఫోర్లతో తన ఉద్దేశమేంటో చాటాడు. రెండో ఓవర్లో బౌండరీతో జోరందుకున్న ట్రావిస్ హెడ్(32) మార్ష్‌తో పోటీగా చెలరేగాడు. వీరిద్దరి మెరుపులతో 4.1 ఓవర్‌కే స్కోర్ యాభై దాటింది.
The joint-fastest chase at the men’s T20 World Cup with a target of over 100 ⚡ pic.twitter.com/iEEMqHZf2n
— ESPNcricinfo (@ESPNcricinfo) February 20, 2026
మార్ష్, హెడ్ విధ్వంసంతో పవర్ ప్లేను 73 రన్స్ చేసింది. అలీకి చుక్కలు చూపిస్తూ.. మూడు ఫోర్లు, సిక్సర్ బాదాడు మార్ష్. వీరిద్దరి జోరు చూశాక అజేయంగా మ్యాచ్‌ను ముగిస్తారనిపించింది. కానీ, 9వ ఓవర్లో హెడ్ గాల్లోకి లేపిన బంతిని వికెట్ కీపర్‌తో పోటీపడిన షకీల్ ఒడుపుగా అందుకున్నాడు. తొలి వికెట్ తీసిన సంతోషంలో ఒమన్ ఆటగాళ్లకు దక్కినా.. అప్పటికే ఆసీస్ విజయం ఖాయమైంది. 17 పరుగులే అవసరమవ్వగా.. జోష్ ఇంగ్లిస్(12 నాటౌట్)తో కలిసి మార్ష్ లాంఛనం పూర్తి చేశాడు.
జంపా మ్యాజిక్
వరల్డ్‌కప్‌లో బోణీ కొట్టని ఒమన్‌కు చివరి మ్యాచ్‌లోనూ బ్యాటర్లు పెద్ద స్కోర్ అందించలేదు. ఇన్నింగ్స్ తొలి బంతికే ఓపెనర్ అమిర్ కలీం(0)ను బౌల్డ్ చేసి గ్జావియర్ బార్ట్లెట్(2-27) వికెట్ల వేటకు తెరతీశాడు. బార్ట్లెట్, ఎల్లిస్ విజృంభణతో పవర్ ప్లేలో కీలక వికెట్లు పడగా.. ఒమన్ కష్టాల్లో కూరుకుపోయింది. అసలే తడబడుతున్న ప్రత్యర్ధి బ్యాటర్లను ఆడం జంపా(4-21) మరింత దెబ్బకొట్టాడు. హమ్మద్ మిర్జా(16) వికెట్‌తో ఖాతా తెరిచిన లెగ్ స్పిన్నర్ కోలుకోలేకపోయింది.
Adam Zampa is climbing the charts 📈 pic.twitter.com/RraVIAHeBs
— ESPNcricinfo (@ESPNcricinfo) February 20, 2026
వసీం అలీ(32) పోరాడినా.. సహచరులు డగౌట్‌కు క్యూ కట్టారు. చివరి బ్యాటర్ షఫీక్ జైన్(0)ను బౌల్డ్ చేసిన జంపా 104 వద్ద ఒమన్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు. నాలుగు వికెట్ల పడగొట్టిన జంపా.. పొట్టి వరల్డ్‌కప్ చరిత్రలో రెండో అత్యధిక వికెట్ల వీరుడిగా అవతరించాడు. బంగ్లాదేశ్ వెటరన్ షకీబుల్ హసన్50 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా.. రషీద్ ఖాన్ (43 వికెట్లు) మూడో స్థానానికి పడిపోయాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

