ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Telangana - Jan 25, 2021 , 20:59:00

టీఆర్‌ఎస్‌లోకి భారీగా చేరికలు

టీఆర్‌ఎస్‌లోకి  భారీగా చేరికలు

మంచిర్యాల : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఆకర్శితులయ్యే టీఆర్‌ఎస్‌లో అనేక మంది చేరుతున్నారని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. సోమవారంబెల్లంపల్లి పట్టణంలోని ఎమ్యెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణంలోని 9వ వార్డు కౌన్సిలర్‌ భుక్యా రామ్‌నాయక్‌ ఆధ్వర్యంలో 100 మంది టీఆర్‌ఎస్‌ లో చేరారు. ఎమ్మెల్యే వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. కార్యక్రమంలో కాసిపేట జడ్పీటీసీ చంద్రయ్య, రాంచందర్‌, మాజీ కౌన్సిలర్‌, కవిత తదితరులు పాల్గొన్నారు. 


VIDEOS

logo