రాజ్యాధికారం కోసం బడుగులమంతా ఏకమవ్వాల్సిన సమయం వచ్చిందని బీసీ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. బీసీల పక్షాన ప్రశ్నించే గొంతుకగా ముందుండి పోరాటం చేస్తున్న కాసాని జ్ఞానేశ్వర్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని స్పష్టం చేస్తున్నారు. బడుగులు బలపడొద్దని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలను ఈ ఎన్నికల్లోనే తిప్పికొడదామని పిలుపునిస్తున్నారు. వాస్తవాలను గ్రహించి ముందుకు సాగితే రాజ్యాధికారం తప్పకుండా సాధ్యమేనని చెబుతున్నారు. బీసీ బిడ్డను గెలిపించుకోకపోతే రాజకీయ పార్టీలు బీసీలను చిన్నచూపు చూస్తాయని హెచ్చరిస్తున్నారు. అలాంటి పరిస్థితి రాకుం డా జాగ్రత్తగా వ్యవహరించాలని.. బీసీలను ఓటు బ్యాంకు గా చూసే నాయకులకు ఈ ఎన్నికల్లో వేసే ప్రతి ఓటూ చెంపపెట్టులా ఉండాలని సూచిస్తున్నారు. చేవెళ్ల గడ్డపై ‘కాసాని’దే జయకేతనమని, బడుగులమంతా ఏకమై గెలిపించుకుని తీరుతామని ప్రతిన బూనుతున్నారు.
– రంగారెడ్డి, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ)
-శంకర్ యాదవ్, రామన్నగూడ మాజీ సర్పంచ్ ,చేవెళ్లటౌన్
బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు సముచిత ప్రాధాన్యమిచ్చింది. చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా బీసీ బిడ్డ కాసాని జ్ఞానేశ్వర్‌కు కేసీఆర్ టికెట్ కేటాయించడంతో ఆయన్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత బీసీలందరిపైనా ఉన్నది. కాసానిని గెలిపించి.. బీఆర్ఎస్ అధినేతకు బహుమతిగా ఇద్దాం.
– శ్రీనివాస్, నారాయణదాస్గూడ, చేవెళ్లటౌన్
చేవెళ్ల గడ్డపై ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురడం ఖాయం. కాసాని జ్ఞానేశ్వర్ భారీ మెజార్టీతో విజయం సాధిస్తారు. బీసీల కోసం గతంలో ఆయన అనేక ఉద్యమాలు చేశారు. బీసీలందరూ తమ ఓటును కారు గుర్తుకు వేసి కాసానికి మద్దతుగా నిలవాలి.
-రాజగోపాలచారి, మాజీ ఎంపీపీ దోమ
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో బీసీలే ఉన్నారు. అందుకే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీసీ బిడ్డకు పోటీ చేసే అవకాశం ఇచ్చారు. అందువల్ల బీసీలందరూ పార్టీలకతీతంగా ఏకమై కాసాని జ్ఞానేశ్వర్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి. బీసీల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడుతున్న వారికి సరైన బుద్ధి చెప్పాలి. కాసానిని గెలిపించి బీసీల ఐక్యతను చాటాలి.
-నల్ల రామ్‌నాథ్, వికారాబాద్ జిల్లా బీసీ విద్యార్థి విభాగం జనరల్ సెక్రటరీ, అయినాపూర్, దోమ
బీసీ యువత ఏ పార్టీలో ఉన్నా బీసీల ముద్దు బిడ్డ జ్ఞానేశ్వర్ గెలుపునకు కృషి చేయాలి. కాసాని జ్ఞానేశ్వర్ 96 బీసీ కులాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారు. అలాంటి వ్యక్తికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాన్ని కల్పించారు. అందువల్ల పార్టీలకతీతంగా బీసీ యువత, ఓటర్లు ఏకమై ఈ ఎన్నికల్లో కాసానిని భారీ మెజార్టీతో గెలిపించుకుని.. మన సత్తాను చాటాలి.
-బీ.రాజు ముదిరాజ్, బీసీ నాయకుడు, కొత్తగూడ
బీసీలను విస్మరించే పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలంటే ఈ ఎన్నికల్లో కాసాని జ్ఞానేశ్వర్‌ను చేవెళ్ల నుంచి భారీ మెజార్టీతో గెలిపించాలి. ఆయన బీసీల పక్షాన ప్రశ్నించే గొంతుకగా ముందుండి పోరాటం చేస్తున్నారు. బడుగులు బలపడొద్దని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలను ఈ ఎన్నికల్లోనే తిప్పికొట్టాలి.
-చింతల నవీన్‌కుమార్, ఐటీ ఉద్యోగి, కొత్తగూడ
నిస్వార్థంగా బీసీల అభ్యున్నతికి కృషి చేస్తున్న కాసాని జ్ఞానేశ్వర్‌ను ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి బీసీపైనా ఉన్నది. ఆయన పార్లమెంట్‌కు వెళ్తే బీసీల సమస్యలు పరిష్కరమవుతాయి. మన వాణి లోక్‌సభలో వినిపిస్తుంది. ఓటు బ్యాంకుగా వాడుకునే రాజకీయ పార్టీల మాటలను నమ్మి మోసపోకుండా బీసీలు ఐక్యతతో ముందుకెళ్లాలి.
-ప్రదీప్‌కుమార్, లింగాయత్ సంఘం నాయకుడు, బడంగ్‌పేట
బీసీలు మౌనం వీడాలి. బీసీలకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్న కాసాని జ్ఞానేశ్వర్‌ను గెలిపించుకోవాలి. మౌనంగా ఉండడంతోనే అధికారానికి దూరంగా ఉంటున్నాం. కాసాని గెలుపునకు బీసీల్లో ఉన్న అన్ని కులాలను ఏకం చేద్దాం. ఇంతకాలం వివిధ వర్గాల వారికి మద్దతు ఇచ్చాం.
– నాగరాజు, బీసీ సంఘం నాయకుడు, బడంగ్‌పేట
కాంగ్రెస్, బీజేపీలు బీసీలకు అన్యాయం చేస్తున్నాయి. బీఆర్ఎస్తోనే బీసీలకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో బీసీ అభ్యర్థి అయిన కాసానిని గెలిపించుకుంటే రానున్న రోజుల్లో బీసీల ప్రాధాన్యత రాజకీయాల్లో మరింత పెరుగుతుంది. అన్ని పార్టీలు బీసీలకు సీట్లు ఇచ్చేందుకు ముందుకొస్తాయి. కాసాని గెలుపుతో బీసీల్లో చైతన్యం వస్తుంది.
-గోపాల్ ముదిరాజ్, మండల ముదిరాజ్ సంఘం
ప్రధాన కార్యదర్శి, యాలాల బీసీల గొంతుకను గత ప్రభుత్వాలు అణచివేశాయి. ఇప్పుడు మన గళం వినిపించాల్సిన సమయం వచ్చిం ది. అగ్రవర్ణ నాయకుల అహంకారపూరిత మాటలకు ఓటు ద్వారా సమాధానం చెప్పాలి. కొన్నేండ్లుగా బీసీలు రాజకీయంగా వెనుకబడిపోయారు. కాసాని గెలుపుతో బీసీల గొంతుక లోక్‌సభలో వినిపిస్తుం ది. ఓటు మన చేతిలో ఉన్నది.. విజయం మన ముంగిట ఉన్నది. ఈ అవకాశాన్ని బీసీ బిడ్డలు చేజార్చుకోవద్దు.
-చాకలి వెంకటేశ్, హాజీపూర్, యాలాల
కాంగ్రెస్ నాయకుల మాటలు బీసీలను అవమాన పర్చేలా.. ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి. ఇప్పుడు బీసీల ఐక్యత చూపించాల్సిన సమయం ఆసన్నమైనది. రాజకీయంగా బీసీలను అగ్రవర్ణ నాయకులు ఎదుగనివ్వడంలేదు. బీసీలందరూ పార్టీలకతీతంగా ఏకమై చేవెళ్లలో కాసానిని గెలిపించి మన సత్తాను చాటాలి.
-రవి, పట్లూర్, మర్పల్లి
బీసీలందరం ఏకమై కాసాని జ్ఞానేశ్వర్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన కాసానికి బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల ఎంపీ టికెట్ ఇవ్వడం సంతోషకరం. బీసీలను చిన్నచూపు చూస్తున్న పార్టీలకు కనువిప్పుకలిగేలా ఈ ఎన్నికల్లో కాసానిని గెలిపించుకుంటాం. బీసీలు ఐక్యంగా ఉంటే ఎలా ఉంటుందో అందరికీ అర్థమయ్యేలా చేస్తాం.
– గోవర్ధన్, వికారాబాద్
రాష్ట్రంలో 96 కులాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి వారి సమస్యలపై పోరాటం చేసిన ఘనత కాసాని జ్ఞానేశ్వర్కే దక్కుతుంది. అలాంటి నాయకుడిని గుర్తించిన కేసీఆర్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించడం గొప్ప పరిణామం. బీసీల సమస్యలు పరిష్కారం కావాలంటే కాసాని ఎంపీగా గెలవాల్సిందే. మన సత్తా చాటాల్సిందే.
-రాజు, శాస్త్రీపురం, రాజేంద్రనగర్
పార్లమెంట్లో తెలంగాణ సమస్యలపై చర్చించేవారు కావాలి. అందుకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బలపర్చిన కాసాని జ్ఞానేశ్వర్‌ను గెలిపిస్తేనే అది సాధ్యమవుతుంది. కాంగ్రెస్, బీజేపీల ఎంపీ అభ్యర్థులు ఎప్పుడూ రాష్ట్ర సమస్యలపై మాట్లాడడంలేదు. రాష్ర్టాభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యం. పదేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది.
-వెంకటరమణ, సులేమాన్‌నగర్ డివిజన్, రాజేంద్రనగర్
జాతీయ పార్టీలు మన సమస్యలను పట్టించుకోవు. ఎన్నికలప్పుడే ప్రజల మధ్య హడావుడి చేసి.. ఆ తర్వాత కనిపించవు. కానీ.. బీఆర్ఎస్ పార్టీ అలా కాదు.. తెలంగాణ అభివృద్ధే ధ్యేయం గా ఆ పార్టీ ఏర్పడింది. కాసాని జ్ఞానేశ్వర్‌ను బీసీలందరూ గెలిపించుకోవాలి. పార్లమెంట్లో బీసీల వాయిస్ వినబడాలంటే..బీసీ నాయకుడిని ఎంపీగా గెలిపించుకోవాలి.