Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘గబ్బర్ సింగ్’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఉగాది కానుకగా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో గ్రాండ్‌గా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో యాంకర్ సుమ కనకాల పవన్ కళ్యాణ్‌తో చిట్‌చాట్ నిర్వహించగా, ఆయన తన కామెడీతో అక్కడున్న వారిని నవ్వుల్లో ముంచెత్తారు. సుమ అడిగిన ప్రశ్నలకు పవన్ సరదాగా ఇచ్చిన కౌంటర్లు అభిమానులను ఆకట్టుకున్నాయి.
సుమ మాట్లాడుతూ, “అప్పట్లో మీ ప్యాషన్ బైక్స్ అన్నారు.. ఇప్పుడు మీ ప్యాషన్ ఏంటి సార్?” అని ప్రశ్నించగా, పవన్ కళ్యాణ్ నవ్వుతూ “అప్పట్లో అంటే 1940లు, 60ల కాలమా?” అంటూ సరదాగా ఎదురుప్రశ్నించారు. దీంతో అక్కడున్నవారంతా తెగ నవ్వారు. అంతేకాకుండా సుమ మాట్లాడుతున్న తీరు గురించి కూడా ఆయన సరదాగా కామెంట్ చేశారు. “మీరు మాట్లాడుతున్న తీరు చూస్తే నేనేదో 1950ల్లో వచ్చిన ‘శ్రీ 420’ సినిమాలో రాజ్ కపూర్‌తో కలిసి నటించినట్టు అనిపిస్తోంది. తిప్పికొడితే మొన్ననే సినిమాలు చేసినట్టు ఉంది. నేను ఎస్వీ రంగారావు, కన్నాంబ, ఎన్టీ రామారావుతో కలిసి కూర్చున్నట్టు మాట్లాడుతున్నారు” అంటూ ఫన్నీగా అన్నారు.
ఇక సుమ తనను మెల్లిగా ‘బీసీ ఎరా’లోకి తీసుకెళ్తున్నారని పవన్ కళ్యాణ్ చమత్కరించారు. తాను రెగ్యులర్‌గా సినిమాలు చేయకపోవడం వల్ల తనను వెనక్కి నెట్టేయడం సరికాదని కూడా సరదాగా చెప్పారు. “ఈ మధ్యనే ‘ఓజీ’ సినిమా వచ్చింది కదా… అయినా నన్ను పాతకాలం నటుడిలా చూపిస్తున్నారు” అంటూ నవ్వించారు. తరువాత తన స్పీచ్‌లో కూడా పవన్ మరోసారి ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రేక్షకులను నవ్వించారు. “ఇందాక సుమ గారు చెప్పినట్టే… చాలా దశాబ్దాల క్రితం, కొన్ని శతాబ్దాల క్రితం నేను సినిమాలు చేస్తున్నప్పుడు… ఆ రోజుల్ని మర్చిపోయిన నా భావనను ఈ సినిమాలో హరీష్ శంకర్ తిరిగి గుర్తు చేశారు” అంటూ చమత్కరించారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత ఇలా సరదాగా మాట్లాడటంతో ఈవెంట్‌కి వచ్చిన అభిమానులు, అతిథులు ఫుల్ ఖుష్ అయ్యారు.