బంగారం ధరలు ఏ స్థాయిలో పరుగులు పెడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం రేట్లు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ నిన్నమొన్నటిదాకా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన విషయం తెలిసిందే. దేశ, విదేశీ మార్కెట్లలో ఆల్‌టైమ్ హై రికార్డులను సృష్టించిన సంగతీ విదితమే. ఈ నేపథ్యంలో గతంతో పోల్చితే ఇప్పుడు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్లకు మరింత గిరాకీ కనిపిస్తున్నది.
బంగారాన్ని భౌతిక రూపంలో కొనడం దగ్గర్నుంచి.. డిజిటల్లో ఇన్వెస్ట్ చేసేదాకా మార్కెట్లో ఎన్నో మార్పులు వచ్చాయి. దీంతో పసిడిపై మదుపు చేసేందుకు నేడు అనేక రకాల ప్లాన్లున్నాయి. వీటిలో ప్రభుత్వ పూచీకత్తు పథకాలతోపాటు ప్రైవేట్ వేదికల్లోనూ పెట్టుబడులకు కొదవే లేకుండా పోయింది. మరి ఆ అవకాశాలేంటో చూద్దాం.
వీటికి ప్రభుత్వ పూచీకత్తు ఉంటుంది. పెరిగే బంగారం ధరల లాభాలకుతోడు 2.5 శాతం వార్షిక వడ్డీరేటూ బాండ్లలో మీరు పెట్టిన పెట్టుబడులకు వర్తిస్తుంది. దీన్ని దీర్ఘకాలిక పెట్టుబడులకు చక్కని ఆప్షన్‌గా చూడవచ్చు. మెచ్యూరిటీ గరిష్ఠ కాలపరిమితి 8 ఏండ్లదాకా ఆగితే మూలధన లాభాల పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్బీఐ వీటిని జారీ చేస్తుంది.
స్టాక్ ఎక్సేంజీలలో ఇవి ట్రేడ్ అవుతాయి. డీమ్యాట్ ఖాతా ద్వారా వీటిల్లో పెట్టుబడులు పెట్టవచ్చు. ఎక్కువ రాబడి, తక్కువ లావాదేవీ ఖర్చులు వీటి ప్రత్యేకత. స్వల్పకాలిక ట్రేడింగ్‌కు అనువైనవి. అయితే మార్కెట్ రిస్కులకు లోబడి రాబడులుంటాయి.
24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) బంగారాన్ని చిన్నచిన్న మొత్తాల్లో (రూపాయి మొదలు) ఆన్లైన్ వేదికగా స్వల్పకాలిక లక్ష్యాల కోసం కొనుగోలు చేయవచ్చు. సెక్యూర్డ్ వాల్ట్‌లలో నిల్వ చేస్తారు. కావాల్సినప్పుడు భౌతిక బంగారంగా మార్చుకోవచ్చు లేదా అమ్ముకోవచ్చు.
గోల్డ్ ఈటీఎఫ్‌లలో ఈ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు పెడుతాయి. డీమ్యాట్ ఖాతాతో పనిలేకుండా సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్)ను నడిపించాలని చూసే మదుపరులకు ఇవి అనువైనవి.
భౌతిక బంగారం (నగలు/నాణేలు/కడ్డీలు) బంగారం నగలు, నాణేలు, కడ్డీలనూ కొని పెట్టుబడిగా చూసుకోవచ్చు. వీటి నిల్వ రిస్క్‌తో కూడిన వ్యవహారం. అలాగే తయారీ, తరుగు చార్జీలు, జీఎస్టీ భరించాలి.
మార్కెట్లోని ప్రముఖ జ్యుయెల్లర్స్ ఈ పథకాలను నడిపిస్తున్నారు. నెలనెలా ఏడాదిపాటు నిర్ణీత మొత్తాల్లో చెల్లిస్తే.. ధరల్లో డిస్కౌంట్ లేదా బోనస్‌తో బంగారు నగలను కొనుక్కునే వెసులుబాటును కల్పిస్తున్నారు.
బంగారంతోపాటు ఇటీవలికాలంలో వెండిపైనా పెట్టుబడులకు చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారు. మరి వెండిపై పెట్టుబడులకున్న మార్గాలేంటో పరిశీలిస్తే..
తక్కువ ఖర్చుకే ఎక్కువ నాణ్యత కలిగిన సిల్వర్‌ను సొంతం చేసుకోవచ్చు. 99.9 స్వచ్ఛతతో స్టాక్ ఎక్సేంజీలపై ఇవి ట్రేడ్ అవుతాయి.
డీమ్యాట్ ఖాతా లేకుండా వీటిలో పెట్టుబడులకు వీలుంటుంది. సిల్వర్ ఈటీఎఫ్ ప్రదర్శనను ట్రాక్ చేసేందుకు మంత్లీ సిప్‌లకు అనుమతి ఉంటుంది.
ఇవి భౌతిక పెట్టుబడులు. అయితే నిల్వ, భద్రత, స్వచ్ఛత సంబంధిత ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 99.9 స్వచ్ఛతను పరిశీలించి కొనాలి.
యాప్‌ల ద్వారా చిన్నచిన్న మొత్తాల్లో (రూపాయి మొదలు) కొనుగోలు చేయవచ్చు. నిల్వ సమస్యలుండవు. 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత)తో విక్రయాలు జరుగుతాయి.
బంగారం, వెండిపై పెట్టుబడులను అనేక అంశాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి. అలాగే రేట్లు అమాంతం పెరిగిన నేపథ్యంలో మోసాలకూ వీలున్నది. కనుక ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి. డిజిటల్ యాప్స్, ఇతరత్రా వేదికల ద్వారా కొనేటప్పుడు వాటిలో నిజమెంత? అన్నది
పరిశీలించాలి.