Financial Managment | చిట్టి చేతులతో చిన్నచిన్నగా.. పిల్లలకు ఆర్థిక పాఠాలు చెప్పండిలా
Financial Managment | మనలో చాలామంది.. పిల్లలకు ఓ వయసు వచ్చాకగానీ ఆర్థికపరమైన అంశాల జోలికి వెళ్లనివ్వం. అందుకే నేడు మెజారిటీ యువతకు కుటుంబ ఆర్థిక పరిస్థితులపై సరైన అవగాహన ఉండటం లేదంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. అయితే పసితనం నుంచే తల్లిదండ్రులు పిల్లలకు ఆర్థిక పాఠాలు నేర్పితే.. వారికి ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
Financial Managment | మనలో చాలామంది.. పిల్లలకు ఓ వయసు వచ్చాకగానీ ఆర్థికపరమైన అంశాల జోలికి వెళ్లనివ్వం. అందుకే నేడు మెజారిటీ యువతకు కుటుంబ ఆర్థిక పరిస్థితులపై సరైన అవగాహన ఉండటం లేదంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. అయితే పసితనం నుంచే తల్లిదండ్రులు పిల్లలకు ఆర్థిక పాఠాలు నేర్పితే.. వారికి ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. నగదు విలువ, పొదుపు వంటివి చిరుప్రాయంలోనే వివరించగలిగితే.. పెద్దయ్యాక వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొంటున్నారు. పాఠ్యపుస్తకాల్లో చదివేదానికంటే జీవితంలో చూసి నేర్చుకునేదే ఎంతో ముఖ్యం మరి.
ఇదీ సంగతి: పిల్లలు ఆర్థికపరమైన విషయాలను కేవలం వినడం ద్వారానేగాక.. పెద్దల ప్రవర్తనను చూస్తూ నేర్చుకుంటారు. కనుక తల్లిదండ్రులు ఆర్థిక అంశాలను పిల్లల వద్ద దాచిపెడితే.. వారికి వాస్తవ పరిస్థితులపై అవగాహన కొరవడుతుంది. అందుకే మన ఖర్చులు, సంపాదన ఇలాంటివన్నీ వారికి తెలిసేలా చేయడం ఎంతైనా మంచిది. ఇక మీరు వృథా ఖర్చులు చేస్తూపోతే.. మీ పిల్లలూ అదేవిధంగా తయారయ్యే ప్రమాదం ఉన్నది. అలాగే చిన్న పిల్లలు కదా అని, మారాం చేస్తున్నారని అడిగింది ఇస్తూపోతే డబ్బు విలువ తెలియకుండాపోతుంది. కాబట్టి ఏది అవసరం? మరేది అనవసరం? అన్నది వారికి తెలియజేస్తూ.. అక్కెరకు వచ్చేవి మాత్రమే అందించాలి.
పిల్లలు పెద్ద పెరుగుతున్నప్పుడు సమయం ఉన్నప్పుడల్లా మీ ఆర్థిక ఒత్తిళ్లనూ వారితో పంచుకుంటే.. కుటుంబ ఆర్థిక పరిస్థితులకు తగ్గట్టుగా వారూ నడుచుకుంటారు. ఇక పొదుపు, పిసినారితనానికి మొదట్లో చిన్న గీతే అడ్డుగా ఉంటుంది. ఆ గీతకున్న అర్థం పిల్లలకు తొలినాళ్ల నుంచే తల్లిదండ్రులు వివరించినైట్టెతే.. మనవారు పూర్తిగా డబ్బు మనుషులు కాకుండా కూడా జాగ్రత్తపడవచ్చు. పెట్టుబడులతోపాటు బీమా అవసరాన్నీ తెలియజెప్పాలి. అప్పుడే సరైన ఆర్థిక ప్రణాళికల్ని వేసుకునే సామర్థ్యం వారికి ఉంటుంది. ఏవైనా ఎదురు దెబ్బలు తగిలినప్పుడు ఎలా నిలదొక్కుకోవాలి, కుటుంబం అండకు ఎంత ప్రాధాన్యం ఉంటుంది.. అన్నదీ పిల్లలకు వివరిస్తూపోతే భవిష్యత్తులో ఆర్థికపరంగానూ, కుటుంబపరంగానూ బలంగా తయారవ్వగలరు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

