Chennaraopet | యూరియా (Urea) కోసం రైతుల అవస్థలు తప్పడం లేదు. పంటను కాపాడుకునేందుకు ఎరువుల కోసం పొద్దు, మాపు అనే తేడా లేకుండా అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు. వర్షాలను సైతం లెక్కచేయకుండా సహకార సంఘాల వద్ద గంట కొద్ది వేచి ఉంటున్నారు. అయినా వారికి నిరాశే ఎదురవుతున్నది. కాంగ్రెస్ సర్కార్ అలసత్వంతో పంటలు సాగు చేసుకోవాల్సిన రైతులు ఎరువుల కోసం కాలం వెళ్లదీస్తున్నారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట (Chennaraopet) లోని ఓ యూరియా గోదామ్ వద్ద రైతులు బారులు తీరారు. తెల్లవారుజామునే మహిళలు, పురుషులుకు పెద్ద సంఖ్యలో చెన్నారావుపేటకు చేరుకుని క్యూ లైన్లలో నిలబడ్డారు.
కాల్మొక్త బాంచెన్.. యూరియా కోసం అధికారుల కాళ్లు మొక్కిన రైతులు
అదే గోస.. అదే యాతన.. రైతన్నకు యూరియా తిప్పలు
బ్లాక్ మార్కెట్ దందా.. అన్నదాతలను లూటీ చేస్తున్న అక్రమార్కులు
కాంగ్రెసోళ్లే దళారులు.. నల్లబజారుకు తరలిస్తున్నది వాళ్లే: కేటీఆర్
తాళం తెరిచి ఎరువుల చోరీ.. తాడిచెర్ల పీఏసీఎస్‌లో 50 బస్తాలు మాయం