పాల్వంచ, మార్చి 18 : పాల్వంచ పట్టణంలోని జాతీయ రహదారి పక్కన గల వేణుగోపాల్ థియేటర్ ప్రాంగణంలో ఈ నెల 19 నుండి 21వ తేదీ వరకు కళా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీ పరాభవ నామ తెలుగు సంవత్సర – 2026, ఉగాది వేడుకలకు సంబంధించి బ్రోచర్లు బుధవారం ఆవిష్కరించారు. ఉత్సవాల్లో ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ సంగీత విభావరి ఉండనున్నట్లు తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుండి కవులు, కళాకారులు ఉత్సవాలకు హాజరు అవుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళా పరిషత్ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ బిక్కసాని సుధాకర్, అధ్యక్షుడు మంతపురి రాజు గౌడ్, గౌరవ సలహాదారులు కొత్త వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి వేముల కొండలరావు, డాక్టర్ బుచ్చయ్య, లింగమూర్తి, శీరంశెట్టి కాంతారావు, సాంబశివరావు, చలువాది ప్రకాష్, సంపత్ కుమార్, అప్పలాచార్యులు, నరసింహమూర్తి పాల్గొన్నారు.