తాండూర్ : శిక్షణ పొందిన వార్డు సభ్యులు (Ward members) శిక్షణను సద్వినియోగం చేసుకొని గ్రామాభివృద్ధి దిశగా సమర్ధంగా పనిచేయాలని బెల్లంపల్లి డీఎల్పీవో డీ సతీష్ కుమార్ (DLPO Satish Kumar ) సూచించారు. మండలంలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యుల కోసం కొత్తపల్లి రైతు వేదికలో 5 రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ బుధవారం ముగిసింది.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యాక్రమంలో ఆయన మాట్లాడుతూ పంచాయతీ రాజ్ వ్యవస్థలో వార్డు సభ్యుల పాత్ర ఎంతో ముఖ్యమని, గ్రామ ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించడంలో చురుకుగా వ్యవహరించాలని కోరారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు గ్రామస్థులకు సమర్ధవంతంగా చేరేలా కృషి చేయాలని సూచించారు. అనంతరం వార్డు సభ్యులకు దృవీకరణ పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో పీ శ్రీనివాస్, మాస్టర్ ట్రైనర్స్, నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులు పాల్గొన్నారు.