గట్టుప్పల్, మార్చి 18 : గట్టుప్పల్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఆత్మ వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆద్వర్యంలో బుధవారం శిక్షణ నిర్వహించారు. మునుగోడు ఏడిఏ వేణుగోపాల్, హార్టికల్చర్ అధికారి విద్యాసాగర్ హాజరై ఆయిల్ పామ్ పంట గురించి, దాని సాగు విధానం, అనువైన నేలలు, మార్కెటింగ్ గురించి వివరించారు. పంట మార్పిడి విధానం, దాని వల్ల కలిగే లాభాలను రైతులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఓ ఎం.రేవతి, జి.రాకేశ్, కార్తీక్, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.