మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 27, 2020 , 16:39:48

రైతు వేదికల నిర్మాణాలు సకాలంలో పూర్తి చేయాలి

రైతు వేదికల నిర్మాణాలు సకాలంలో పూర్తి చేయాలి

కుమ్రం భీం అసిఫాబాద్ :  అన్నదాతల ఆర్థిక అభివృద్ధే  ప్రభుత్వ ధ్యేయమని జెడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి అన్నారు. అసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి అసిఫాబాద్‌ మండలం బాబార్ లో రైతు వేదిక నిర్మాణానికి భూమి పూజ చేశారు. రైతు వేదిక నిర్మాణం పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో అసిఫాబాద్ జెట్పీటీసీ అరిగెల నాగేశ్వరరావు, ఎంపీపీ మల్లికార్జున్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.logo