కన్నడ బ్యూటీ రష్మిక బాలీవుడ్ స్టార్ హీరో సినిమాని ఎందుకు రిజక్ట్ చేసిందో చెప్పింది. ప్రస్తుతం అమ్మడు మిషన్ మజ్ను, గుడ్ బై వంటి పలు హిందీ సినిమాలు చేస్తోంది. ఈ సినిమాల కన్నా ముందే అమ్మడికి షాహిద్ కపూర్ తో నటించే ఛాన్స్ వచ్చింది. తెలుగులో నాని నటించిన జెర్సీ సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మికని తీసుకోవాలని అమ్మడిని సంప్రదిస్తే రిజక్ట్ చేసిందన్న వార్తలు వచ్చాయి. దీనిపై ఇప్పుడు క్లారిటీ ఇచ్చింది అమ్మడు.
షాహిద్ కపూర్ జెర్సీ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చినా వదులుకున్నానని తెలిపింది. అందుకు కారణం కూడా చెప్పింది. తెలుగు జెర్సీలో నటించిన శ్రద్ధా శ్రీనాథ్ లాగా తాను నటించలేనని తెలిపింది. ఆ పాత్రకు ఆవిడే న్యాయంచేయగలదని భావించి షాహిద్ సరసన వచ్చిన ఛాన్స్ వదులుకున్నానని స్పష్టం చేసింది.