హైదరాబాద్ : పేద ప్రజలు సైతం సొంత ఇంటిలో సంతోషంగా, గొప్పగా బతుకాలనేది సీఎం కేసీఆర్ సంకల్పమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్అ న్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఇందిరానగర్లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులను గుర్తించే సమావేశంలో మంత్రి తలసాని పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇండ్ల కేటాయింపులో పారదర్శత కోసమే ముందుగానే లబ్ధిదారుల ఎంపిక చేస్తున్నామన్నారు. పేద ప్రజలకు ఉచితంగా ఇండ్లు నిర్మించి ఇస్తున్న పథకం తెలంగాణ రాష్ట్రంలో తప్ప దేశంలో ఎక్కడా లేదన్నారు. మంత్రి తలసాని వెంట ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయా రెడ్డి తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
రైతు సంఘాల కమిటీకి సర్కార్ తాజా ప్రతిపాదన : నిర్ధిష్ట హామీలకు ఎస్కేఎం పట్టు
Nallagonda | సంతోషిమాత ఆలయంలో గవర్నర్ ప్రత్యేక పూజలు
Mulugu | ప్రజల అభివృద్ధితోనే దేశాభివృద్ధి : నీతి ఆయోగ్ వైస్ చైర్మన్