ఫిబ్రవరి 15 దాకా ఫాస్టాగ్‌కు గడువు

- మరోసారి పొడిగించిన కేంద్ర ప్రభుత్వం
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఫాస్టాగ్ అమలు గడువును మరోసారి పొడిగించారు. ఫిబ్రవరి 15 వరకు ఫాస్టాగ్ తీసుకునే అవకాశాన్ని కల్పించారు. టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీని తగ్గించడంతో పాటు, వాహన రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు కేంద్రప్రభుత్వం 2019లో ఫాస్టాగ్‌ను తీసుకొచ్చింది. పలు కారణాలతో ఫాస్టాగ్ అమలు ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడగా.. 2021 జనవరి 1 నుంచి ప్రతి వాహనదారుడు ఫాస్టాగ్ ద్వారానే టోల్‌ప్లాజాల దగ్గర చెల్లింపులు జరపాలని నిర్దేశించింది. అయితే ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 70 శాతం మంది వాహనదారులు మాత్రమే ఫాస్ట్‌టాగ్ తీసుకొన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం మరోసారి గడువును పొడిగించింది. 2021 ఫిబ్రవరి 15 వరకు నిబంధనలను సడలించింది.
తెలంగాణలో 216 పీవోఎస్‌లు
ఫాస్టాగ్ కార్డును ఒక్కసారి తీసుకుంటే ఐదేండ్ల వరకు చెల్లుబాటులో ఉంటుంది. కార్డు సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.250 కాగా, వన్ టైమ్ ట్యాగ్ జాయినింగ్ ఫీజును రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఫాస్టాగ్ కార్డును బ్యాంకుల నుంచి, టోల్ ప్లాజా కార్యాలయాల వద్ద, రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్యాలయాల దగ్గర కొనుగోలు చేయవచ్చు. రాష్ట్రంలోని నిర్మల్, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ పరిధిలోని మొత్తం 21 టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ విక్రయాల కోసం ఇప్పటివరకు 216 పీవోఎస్‌లను ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
- బిగ్‌బీ వీడియోపై గీతా గోపీనాథ్ స్పందన
- బెల్లో టెక్నీషియన్, ఇంజినీరింగ్ అసిస్టెంట్ పోస్టులు
- అందరికీ సమాన అవకాశాలు : మంత్రి కేటీఆర్
- గుడ్ న్యూస్ చెప్పిన అరియానా.. !
- ఆలయాలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం ఏంచేస్తోంది : పవన్ కల్యాణ్
- 15 రోజుల్లో పీవీ విజ్ఞాన వేదిక పనులు ప్రారంభం
- మేలో కాంగ్రెస్ ప్లీనరీ.. అప్పుడే కొత్త అధ్యక్షుడి ఎన్నిక
- బెంగాల్ మంత్రి రాజీవ్ బెనర్జి రాజీనామా
- మా సెర్చ్ ఇంజిన్‌ను ఆపేస్తాం.. గూగుల్ హెచ్చరిక
- డార్క్ వెబ్‌లో కీలక డేటా