మూసీ సుందరీకరణ కోసం అక్రమనిర్మాణాల పేరిట పేదలను కాంగ్రెస్ ప్రభుత్వం నిరాశ్రయులుగా మారుస్తుంటే.. ఆ భూములను స్వాధీనం చేసుకునే వరకు పనులు మొదలుపెట్టకూడదనే యోచనలో అధికారులు ఉన్నారు.
మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లను కూలిస్తే రాష్ట్ర ప్రభుత్వమే కూలుతుందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. �
‘పేద పిల్లలకు అన్నం పెట్టేందుకు డబ్బులు లేవంటున్న సీఎం రేవంత్రెడ్డి మూసీ సుందరీకరణ కోసం లక్షా యాభై వేల కోట్లు ఎలా వెచ్చిస్తున్నారు.. మీ ప్రాధాన్యత దేనికి? పేద పిల్లలకు బుకెడు బువ్వ పెట్టడానికా? లక్షన్న�