హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): మెయిన్‌హార్ట్ సంస్థకు బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమాపణలు చెప్పబోరని ఆ పార్టీ లీగల్ టీమ్ గురువారం స్పష్టం చేసింది. మెయిన్హార్ట్పై చేసిన ఆరోపణలకు క్రిశాంక్ కట్టుబడే ఉన్నారని పేర్కొంది. ఆ సంస్థ ఇచ్చిన నోటీసులకు మన్నె క్రిశాంక్, ఆయన తరఫున బీఆర్ఎస్ లీగల్ టీమ్ సుదీర్ఘ వివరణ ఇచ్చింది. సీఎం రేవంత్ బహిరంగంగా రూ.1.5 లక్షల కోట్ల ఖర్చుతో మూసీ సుందరీకరణను ప్రకటించారని, మెయిన్‌హార్ట్ సంస్థ యాజమాన్యం గతంలో ముఖ్యమంత్రి రేవంత్‌ను ఆయన కార్యాలయంలో కలిసిందని ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
టెండర్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఈ కంపెనీకి ప్రభుత్వం కాంట్రాక్టును కట్టబెట్టిందని పేర్కొన్నది. ఇతర కంపెనీలు తకువ ధర కోట్ చేసినా.. దానిని పకన పెట్టి మెయిన్‌హార్ట్‌కు ఇవ్వడం అనుమానాస్పదంగానే ఉన్నదని తెలిపింది. క్రిశాంక్ ఆ సంస్థపై ఆధారాలతో చేసిన ఆరోపణలు, ఆ సంస్థపై పాకిస్థాన్, ఇంటర్‌పోల్ రెడ్ వారెంట్ వేయడం, భారతదేశ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండి యా ఈ కంపెనీని బహిషరించడం, జార్ఖం డ్ ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ చేయడం ఇవన్నీ వాస్తవాలేనని పేర్కొంది.
మెయిన్‌హార్ట్ ఇచ్చిన నోటీసుల్లో కూడా ఈ కేసులు వారిపై ఉన్నట్టు ఒప్పుకున్నారని లీగల్ టీమ్ తెలిపింది. మూసీ కాంట్రాక్టు ప్రజాధనంతో కూడుకున్నదని, కాబట్టి ఒక ప్రతిపక్ష పార్టీలో బాధ్యతగల నాయకునిగా, ఆ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్‌గా, మీడియా చర్చల్లో పాల్గొనే నేతగా, ప్రశ్నించే స్వాతంత్య్రం, హకు క్రిశాంక్‌కు ఉ న్నదని లీగల్ సెల్ పేరొన్నది. లీగల్ నోటీసులపై కోర్టులో పోరాటానికి సిద్ధంగా ఉన్నట్లు లీగల్‌సెల్ స్పష్టం చేసింది.