హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): మూసీ సుందరీకరణ, పునరుజ్జీవన చర్యలను తాము వ్యతిరేకించడం లేదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు.
మూసీ నదికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించి అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి సూచించారు. మూసీ పరీవాహక ప్రాంతంలో 30-40 ఏండ్లుగా నిర్మించుకున్న ఇండ్లను కూల్చివేయవద్దని కోరారు