హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): మూసీ ప్రక్షాళనకు మద్దతిస్తామని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. శుక్రవారం కరీంనగర్లో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ముందుగా 11 వేల కుటుంబాల జీవనోపాధికి ఢోకా లేకుండా చేయాలని సూచించారు. మూసీ పేరిట రూ.లక్షన్నర కోట్ల దోపిడీకి బీజేపీ వ్యతిరేకమని తెలిపారు. హైడ్రా పేరిట ఇండ్లను కూల్చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.