24 గంటల ఉచిత కరెంటు వంటివి కొనసాగాలంటే బీఆర్ఎస్ గెలవాలని.. మా అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయ దుందుభి మోగించాలని గులాబీ బాస్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఉద్ఘాటించారు.
“గిరిజన జిల్లా ఆసిఫాబాద్‌ను మరింత అభివృద్ధి చేసి అగ్రస్థానంలో నిలపడమే నా ముందున్న లక్ష్యం. కాంగ్రెస్ 70 ఏండ్ల పాలనలో చేసిందేమీ లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత కేవలం పదేండ్లలో మేము ఎంతో ప్రగతి సాధించాం.
స్వరాష్ట్రంలోనే జోడేఘాట్‌కు గుర్తింపు వచ్చిందని జడ్పీ చైర్పర్సన్, ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోవ లక్ష్మి అన్నారు. మండలంలోని జోడేఘాట్, కొలాంగూడ, పెద్ద పాట్నాపూర్, చిన్న పాట్నాపూర్,
ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు కోవ లక్ష్మి, కోనేరు కోనప్ప విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు అడుగడుగునా వారికి నీరాజనం పలుకుతున్నారు.