ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో బీఆర్ఎస్ ప్రచారం జోరుగు సాగుతున్నది. గురువారం ఆసిఫాబాద్, సిర్పూర్, మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో అభ్యర్థులు కోవ లక్ష్మి, కోనేరు కోనప్ప, నడిపెల్లి దివాకర్‌రావు, బాల్క సుమన్, దుర్గం చిన్నయ్య విస్తృతంగా పర్యటించారు.
రోడ్ షోలు, సమావేశాలు నిర్వహించి.. కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. గులాబీ దళం గడపగడపకూ వెళ్లి పథకాలను వివరించి ఓట్లు అడిగింది. పలుచోట్ల కాంగ్రెస్, బీజేపీల నాయకులు బీఆర్ఎస్ కండువాలు కప్పుకొని, సీఎం కేసీఆర్ నాయకత్వానికి జై కొట్టారు. అభ్యర్థుల కుటుంబ సభ్యులు సైతం పట్టణాలు, పల్లెల్లో కలియదిరిగి మ్యానిఫెస్టో కరపత్రాలను అందించారు.