‘ది కేరళ స్టోరీ 2’కు కోర్ట్ షాక్
2023లో విడుదలైన ‘ది కేరళ స్టోరీ’ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రెండేళ్ల విరామం తర్వాత దానికి సీక్వెల్‌గా ‘ది కేరళ స్టోరీ 2’ చిత్రాన్ని కామాఖ్య నారాయణ్‌సింగ్ రూపొందించారు. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 27న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
2023లో విడుదలైన ‘ది కేరళ స్టోరీ’ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రెండేళ్ల విరామం తర్వాత దానికి సీక్వెల్‌గా ‘ది కేరళ స్టోరీ 2’ చిత్రాన్ని కామాఖ్య నారాయణ్‌సింగ్ రూపొందించారు. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 27న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇటీవలే టీజర్‌ని రిలీజ్ చేశాయగా, అందులో చూపించిన అంశాలు వివాదాలకు దారితీశాయి. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా సినిమా రూపొందించారంటూ కేరళ హైకోర్ట్‌లో ఈ సినిమాపై పిటీషన్ దాఖలైంది. మంగళవారం దీనిపై జరిగిన విచారణ అనంతరం కేరళ హైకోర్ట్ ఈ సినిమాపై కీలక వ్యాఖ్యలు చేసింది.
‘సాధారణంగా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ విషయంలో కోర్టు జోక్యం చేసుకోదు. కానీ ఈ సినిమా పేరులో ‘కేరళ’ అని రాష్ట్రం పేరును వాడారు. ఇది ఓ రాష్ట్ర ఆత్మాగౌరవానికి చెందిన విషయం కావడంతో విచారించక తప్పలేదు. సినిమాను వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించామని చెబుతున్నందున, కేరళ ప్రజల భయాందోళనలను విస్మరించలేం. ఓ వర్గాన్ని కానీ.. ప్రాంతాన్ని కానీ కించపరిచేలా కళారూపాలు ఉండకూడదు. చట్టపరమైన నిబంధనల ప్రకారం అభ్యంతకరమైన దృశ్యాలు కానీ, మాటల కానీ చేర్చకూడదు. అందుకే.. ఈ సినిమాను పూర్తిగా చూడాలనుకుంటున్నాం. ఈ నెల 25న ఈ సినిమాను కోర్టులో ప్రదర్శించాలి. తర్వాతే విడుదలపై నిర్ణయం తీసుకోగలం’ అని కోర్టు తెలిపింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

