హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): యువతకు ఐటీ రంగంలో ప్రోత్సాహం అందించే లక్ష్యంతో బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన టీ-హబ్‌పై అస్ట్రేలియా పౌరసత్వ, బహుళ సాంస్కృతిక వ్యవహారాలశాఖ సహాయ మంత్రి జూలియన్ హిల్ ప్రశంసలు కురిపించారు. టీహబ్ కేవలం భారతదేశంలోనే కాక ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ ఇంక్యుబేటర్ అని కితాబునిచ్చారు. పదేండ్లుగా టీహబ్ అందిస్తున్న సేవలు అద్భుతమని కొనియాడారు. హైదరాబాద్‌లో పర్యటించిన ఆయన టీ-హబ్‌లో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.
టీ-హబ్ ఆవరణలో సంస్థ సీఈవోతో మాట్లాడుతున్న ఓ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. ఆ వీడియోలో జూలియన్ హిల్ మాట్లాడుతూ.. అనేకమంది యువత తమ వినూత్న ఆలోచనలతో ప్రపంచవేదికపై తమ సత్తా చాటేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు. పదేండ్ల కింద టీ-హబ్ ఆస్ట్రేలియాతో భాగస్వామ్యాన్ని ఏర్పర్చుకున్నదని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
టీ-హబ్ వేగంగా దూసుకెళ్తున్నదని జూలియన్ కొనియాడారు. క్రిటికల్ మినరల్స్, డిఫెన్స్, ఫార్మాస్యూటికల్స్, క్లినికల్స్, లైఫ్ సైన్సెస్, అగ్రికల్చర్ రంగాల్లో ఆస్ట్రేలియా, భారత దేశ యువత కలిసి మరిన్ని ఆవిష్కరణలు రూపొందించేందుకు టీ-హబ్ దోహదపడుతుందని ఆకాంక్షించారు. జూలియన్ హిల్ టీ-హబ్‌ను ప్రశంసిస్తూ ఇన్‌స్టాలో చేసిన పోస్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రీపోస్టు చేశారు.
దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు నెట్టిజన్లు టీ-హబ్ ఘనత కేటీఆర్‌దే అంటూ కామెంట్ చేశారు. హైదరాబాద్ టెక్నాలజీ రంగానికి, అంతర్జాతీయ భాగస్వామ్యాలకు కేటీఆర్ నాంది పలికారని కొనియాడుతున్నారు. కేటీఆర్ విజన్‌తోనే ఇన్నోవేషన్లకు హబ్‌గా మారిందని ప్రశంసిస్తున్నారు.