అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ భుజానికి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిందని సికింద్రాబాద్ కిమ్స్ వైద్యులు ప్రకటించారు. నిపుణులైన ప్రత్యేక ఆర్థోపెడిక్ వైద్య బృందం నేతృత్వంలో సర్జరీని నిర్వహించామని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు బుధవారం ప్రెస్‌నోట్‌ను విడుదల చేశారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని, రెండుమూడు నెలల్లో ఆయన పూర్తిగా కోలుకుంటారని వైద్యులు తెలిపారు. సర్జరీ నుంచి త్వరగా కోలుకునేందుకు ఎన్టీఆర్‌కు ప్రత్యేక పునరావాస చికిత్సను చేపట్టనున్నారు. గత నెలలో జిమ్‌లో కసరత్తులు చేస్తున్న సమయంలో ఎన్టీఆర్ భుజానికి గాయమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ చిత్రంలో నటిస్తున్నారు.