నల్లగొండ రూరల్, సెప్టెంబర్ 29 : నల్లగొండ పట్టణంలోని వివిధ కూరగాయల, ఇనుము–హార్డ్వేర్, శానిటరీ దుకాణాల్లో లీగల్ మెట్రాలజీ శాఖ అధికారులు మంగళవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో తూకాలు, కొలతల పరికరాల ధృవీకరణ, స్టాంపింగ్ చెల్లుబాటు, కొలతల ఖచ్చితత్వంతో పాటు ప్యాకేజ్డ్ వస్తువులపై తప్పనిసరిగా ముద్రించాల్సిన వివరాలను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వ్యాపార సంస్థలపై Legal Metrology Act, 2009, Packaged Commodities Rules ప్రకారం మొత్తం 13 కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. సంబంధిత కేసుల్లో నిబంధనల మేరకు తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
వ్యాపారులు తూకాలు, కొలతల పరికరాలను నిర్ణీత కాలవ్యవధిలో ధృవీకరించించుకుని చెల్లుబాటు అయ్యే స్టాంపింగ్తోనే వినియోగించాలని జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి శ్రీనివాసులు సూచించారు. ప్యాకేజ్డ్ వస్తువులపై చట్టబద్ధంగా ప్రకటించాల్సిన అన్ని వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని తెలిపారు. వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని వెల్లడించారు.
తనిఖీల్లో టెక్నికల్ అసిస్టెంట్ కె.వెంకటేశ్వర్లుతో పాటు శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

తూకాల్లో తేడా.. నల్లగొండలో 13 కేసులు నమోదు