RS Praveen Kumar | కొన్ని సోషల్ మీడియా ఛానల్స్, డిజిటల్ మీడియా ఛానల్స్‌లో కేటీఆర్‌తో సహా నలుగురి పాస్‌పోర్టుల తాత్కాలిక జప్తునకు ఆదేశమని ఈనాడు హైదరాబాద్ డేట్‌లైన్‌తో ఒక న్యూస్ వచ్చిందని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. ఈనాడు పత్రికా మిత్రులందరికీ నా విన్నపం ఏంటంటే.. మీకేదైనా న్యూస్ వస్తే దయచేసి వెరిఫై చేసుకోవాలని కోరుతున్నా. ఎప్పుడూ ఊహాజనితమైన వార్తల మీద, పుకార్ల మీద వార్తలు రాస్తే క్రెడిబిలిటీ దెబ్బతింటది.. ఎందుకంటే ఈ పాస్‌పోర్ట్ జప్తు చేయాలని అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానం హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయానికి లేఖ రాసిందని గౌరవ జర్నలిస్ట్ ఈనాడు దినపత్రికలో రాశారు. నా రిక్వెస్ట్ ఏందంటే న్యాయస్థానాలు ఎప్పుడూ కూడా లేఖలు రాయవు. కేవలం ఆర్డర్లు ఇస్తయని స్పష్టం చేశారు.
అదే విధంగా ఫార్ములా ఈ అక్రమ కేసు ఏదైతే ఉందో.. ఈ కేసు మొత్తాన్ని మా బీఆర్ఎస్ సీనియర్ న్యాయవాది జక్కుల లక్ష్మణ్ మానిటర్ చేస్తున్నారు. నేను వారితో కూడా మాట్లాడాను. ఆయన క్లియర్‌గా చెప్పారు. దీనికి సంబంధించి ఏసీబీ వాళ్లు ఒక మెమో ఫైల్ చేసినట్టుగా వాళ్లు చెప్తున్నరు. ఇంతవరకు జక్కుల లక్ష్మణ్‌కు కానీ, ఏ 1 అని పేర్కొంటున్న కేటీఆర్‌కు ఎలాంటి నోటీసు రాలేదు. ఈ నోటీసు రాకుండానే ఏసీబీ న్యాయస్థానం హైదరాబాద్ పాస్‌పోర్ట్ ప్రాంతీయ కార్యాలయ అధికారికి లేఖ రాసినట్టుగా రాస్తున్నారు.. ఎప్పుడూ కూడా న్యాయస్థానాలు లేఖ రాయవు.. న్యాయస్థానాలు కేవలం ఆర్డర్లు మాత్రమే ఇస్తాయన్నారు.
కేటీఆర్ పాస్‌పోర్ట్ జప్తు చేయమని ఏసీబీ కోర్టు చెప్పినట్లు ఈనాడులో తప్పుడు వార్త రాశారు
ఊహాజనితమైన వార్తలు రాయకండి
ఏసీబీ కోర్టు లేఖ రాసినట్లు ప్రచురించారు.. కోర్టులు ఎప్పుడు లేఖలు రాయవు, ఆర్డర్లు మాత్రమే ఇస్తాయి
ఇంతవరకు కేటీఆర్‌కు కూడా ఎలాంటి నోటీసులు రాలేదు
– ఆర్ఎస్ ప్రవీణ్… https://t.co/I7ztePqrYY pic.twitter.com/JjqN9ZrACQ
— Telugu Scribe (@TeluguScribe) September 29, 2026
Allu Arjun | భార్యతో అల్లు అర్జున్ రొమాంటిక్ మూమెంట్.. స్నేహారెడ్డికి బన్నీ స్పెషల్ విషెస్ వైరల్!
Srinivas Reddy | ప్రజలవిశ్వాసమే.. జర్నలిస్టులకు రక్షణ.. ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి
కడు పేదరికం నుండి యువ ద్రోణాచార్యుడిగా పొన్నాల పృథ్వీరాజ్