మండలకేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో మనఊరు-మనబడి కార్యక్రమంలో చేపట్టిన అభివృద్ధి పనులను శుక్రవారం అధికారులు, మున్సిపల్ పాలక మండలి ప్రతినిధులు ప్రారంభించారు.
కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మనఊరు-మనబడి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని మండల ప్రత్యేకాధికారి శ్రీనివాసరావు అన్నారు.
‘మన ఊరు - మన బడి’ పనులను వేగవంతం చేయాలని రాష్ట్రవిద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. పది శాతం గ్రీన్ బడ్జెట్తో పాఠశాలల్లో పచ్చదనం పెంపొందించాలని సూచించారు.