సప్తమిత్ర చరిత్రలో మధిర సుబ్బన్న దీక్షితులు రచించిన మదాలస వృత్తాంతాన్ని చెప్పుకొంటున్నాం. కువలయాశ్వుడనే మహావీరుణ్ని పెళ్లాడిన మదాలస భర్తపై ప్రేమ కొద్దీ.. అతని అసత్య మరణవార్త విని మరణించింది.
కాశీమజిలీల్లో ప్రస్తుతం సప్తమిత్ర చరిత్రలో ఉన్నాం. భోజుని కొలువు సంపాదించుకోవాలనే లక్ష్యంతో కాశీనుంచి బయల్దేరిన మిత్రుల్లో చివరివాడి కథ ఇది.నిజానికి అందరికంటే ముందు భోజరాజును కలిసింది ఇతనే! పేరు ఘోటక�
పురందరపురం కవిపండితులతో కిటకిటలాడుతున్నది. ఆ నగరాధిపతి అయిన హిరణ్యగర్భుడు తిరిగి వచ్చాడు. ఆయన తన కూతురైన సరస్వతి చాలాకాలంపాటు ఎవరినీ వరించకపోవడంతో విసిగి వేసారాడు.
సిద్ధునికి చారాయణునిపై రోజురోజుకూ ప్రేమానుబంధం పెరగసాగింది. అదే సమయంలో వారిద్దరిపై భైరవునికి క్రోధం పెరగసాగింది. ఆ భైరవుడు సిద్ధునికి మొదటి శిష్యుడు. చారాయణుడు ఇటీవలే వచ్చాడు.
ఇలా చిక్కిపోయావేంటి?! అయినా మిత్రమా! నువ్వేమిటీ.. ఈ బెస్తవాళ్లతో కలిసి నావల మీద పనిచేయడం ఏమిటి?! నువ్వేమో సరస్వతిని పెళ్లాడబోతున్నావని తెలిసి, నిన్ను కలుసుకోవడానికే ఇక్కడికి వస్తున్నాను. ఆ వార్త నిజం కాదా?!
తన పగ సాధించడానికి పుల్కసుడు అనే మాతంగుణ్ని ఎన్నుకుంది చింతామణి.అతడు చాలా భక్తిపరుడు. ప్రతిరోజూ సూర్యోదయకాలంలో గంగలో మునిగి, సూర్యునికి మొక్కుకునేవాడు. ఇంటికి వచ్చి పట్టెవర్ధనాలు పెట్టుకుని తన గుడిసెల