Rain Stops Play : ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ పట్టికలో భారత జట్టు (Team India) అగ్రస్థానంలోనే ఉంది. కానీ, అటు న్యూజిలాండ్‌పై సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన శ్రీలంక (Srilanka) దూసుకొస్తోంది. ఈ నేపథ్యంలో ఫైనల్ రేసు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోది. ఈ తరుణంలో భారత జట్టుకు ప్రతి మ్యాచ్ ముఖ్యమే. అందుకని అన్నింటా విజయాలతో మూడోసారి టెస్టు గద(Test Mace) పోరుకు దూసుకెళ్లాలని రోహిత్ సేన పట్టుదలతో ఉంది. కానీ, వరుసగా రెండో రోజు మ్యాచ్ రద్దవ్వడంతో కాన్పూర్ టెస్టు డ్రాగా ముగియడం ఖాయమైంది.
మూడోరోజు వాన లేకున్నా సరే స్టేడియం సిబ్బంది ఔట్‌ఫీల్డ్‌ను ఆరబెట్టలేకపోయారు. దాంతో, మూడో రోజు ఆట సాగుతుదని ఆశించిన భారత్, బంగ్లా జట్లకు, స్టేడియానికి వచ్చిన అభిమానులకు నిరాశే మిగిలింది. ఈ వైఫల్యానికి ఉత్తర ప్రదేశ్ క్రికెట్ సంఘంను మాత్రమే నిందిస్తే సరిపోదు. ఎందుకంటే.. అన్ని బోర్డులకు పెద్దన్న అయిన బీసీసీఐ (BCCI)దే ఈ అపరాధం. దాంతో, ఏటా ఐపీఎల్ ద్వారా, మీడియా, ప్రసార హక్కుల వేలం ద్వారా సమకూరుతున్న కోట్లాది రూపాయలను ఏం చేస్తున్నారు? అని బీసీసీఐపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
Ye BCCI wale mujhe London se bulaye barish dikhane ke liye 💀 pic.twitter.com/BqSfxWhQT8
— Dinda Academy (@academy_dinda) September 29, 2024
UPDATE 🚨
Play for Day 3 in Kanpur has been called off due to wet outfield.#TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/HPPxBMhY87
— BCCI (@BCCI) September 29, 2024
ప్రపంచంలోనే సంపన్న క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ ఏటా కోట్లలో ఆదాయం ఆర్జిస్తోంది. ఐపీఎల్(ipl) టోర్నీ పుట్టుక నుంచి ప్రకటనలు, మీడియా హక్కుల ద్వారా కోట్ల రూపాయలు ఖాజానాలో చేరుతున్నాయి. కానీ, పలు రాష్ట్రాల్లోని స్టేడియాల్లో సౌకర్యాల కల్పన మాత్రం అంతంత మాత్రమే. వాన పడిందంటే మ్యాచ్ రద్దయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకు కారణం ఇంకా భారత్‌లో పాత పద్ధతుల్లోనే పిచ్‌ను ఆరబెడుతున్నారు.
Richest Board BCCI doesn’t have basic drainage facility like Super Sopper so they are mopping the ground with bare hands 😭
Man BCCI bring shame to us, don’t know where those 50,000 crores television right money goes.
Super Sopper is the most basic thing at any Test Venue man. pic.twitter.com/94PQXoONXQ
— ankit Kumar (@ankitKumar12309) September 29, 2024
అన్ని స్టేడియాల్లో పిచ్‌ను కప్పేసేందుకు పాలీథీన్ కవర్లు, నీటిని తోడేసేందుకు సూపర్ సాపర్లు ఇవే వాడుతున్నారు. అప్పుడప్పుడు టేబుల్ ఫ్యాన్స్, ఐరన్ బాక్స్‌లు, హీటర్లు, కరెంటు పొయ్యిలు సైతం వాడిన సందర్భాలు లేకపోలేదు.
కానీ, ఆధునిక పరికరాలపై మాత్రం బీసీసీఐ దృష్టి సారించడం లేదు. అదే.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల్లో పరిస్థితి విభిన్నం. అక్కడ వాన తగ్గిన కాసేపటికే మైదానం సిద్ధమైపోతుంది. ఎందుకంటే.. ఆ దేశాల బోర్డులు పిచ్ తడవకుండా చూసేందుకు హోవర్ కవర్స్ (Hover Covers), నీటిని తోడేసేందుకు ఆధునిక రకం సూపర్ సాపర్స్ వాడుతున్నాయి.
What is the point of being the richest board when you dont have modern equipment to cover and drain grounds pic.twitter.com/IlwPKBRcha
— Kiran (@kirankonnects) September 29, 2024
మొన్నటికి మొన్న… ఇండోర్‌లో అఫ్గనిస్థాన్(Afghanistan), న్యూజిలాండ్ (Newzealand)ల మధ్య జరిగాల్సిన ఏకైక టెస్టు ఒక్క బంతి పడకుండానే రద్దయ్యింది. రెండు రోజుల వాన పడకున్నా సరే ఔట్ ఫీల్డ్, మైదానంలోని పలు ప్రాంతాలను పొడిగా మర్చలేకపోయారు. దాంతో, వేరే దారిలేక రిఫరీ మ్యాచ్‌ను రద్ద చేయడం బీసీసీఐ నిర్వహణ లోపాన్ని అందరికీ తెలిసేలా చేశాడు. ఇప్పుడు కాన్పూర్‌లో భారత జట్టు మ్యాచ్‌కు సైతం అదే పరిస్థితి ఎదురైంది. దాంతో, బీసీసీఐ నిర్లక్ష్యంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిరుడు వన్డే వరల్డ్ కప్‌లో ఉప్పల్ స్టేడియం, చెపాక్ స్టేడియం సిబ్బంది శతవిధాల ప్రయత్నించి ఆట కొనసాగేలా చేశారు. కానీ, మిగతా స్టేడియాల్లో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇకనైనా రాష్ట్రాలకు సంబంధించిన స్టేడియాల్లో ఆధునిక వసతులు ఏర్పాటు చేయాలనదే కోట్లాదిమంది క్రికెట్ అభిమానుల అభిలాష.