IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ వేలాని(Mega Auction)కి సమయం దగ్గరపడుతోంది. మరోవైపు అట్టిపెట్టుకుంటున్న ఐదుగురు ఆటగాళ్ల జాబితాను ఇవ్వాలని ఐపీఎల్ పాలక మండలి ఫ్రాంచైజీలను కోరింది. రిటైన్ ప్లేయర్ల (Retain Players) జాబితాను సమర్పించేందుకు అక్టోబర్ 31 తుది గడువు. దాంతో, ఇప్పటికే ఎవరిని అట్టిపెట్టుకోవాలి? ఎవరిని వదిలించుకోవాలి? అనే విషయంలో స్పష్టతలో ఉన్న ఫ్రాంచైజీలు మరోసారి ఆ లిస్ట్‌ను సరి చూసుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ అజయ్ జడేజా (Ajay Jadeja) ఏయే జట్లు ఎవరిని రిటైన్ చేసుకుంటాయో చెప్పాడు. ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఎవరిని అట్టిపెట్టుకుంటాయో అతడు వివరించాడు. ఐపీఎల్లో తిరుగులేని జట్టు అయిన ముంబై ఇండియన్స్ 17వ సీజన్లో ప్లే ఆఫ్స్ ముందే వెనుదిరిగింది.
Ajay Jadeja feels Mumbai Indian will use RTM card for Hardik Pandya, and and retained three out of Six Rohit Sharma SuryaKumarYadav and Jaspreet bumrah[SportsTak]#KanpurTest#MannKiBatt#DevendraFadnavis #IPL2025 #WanniTheWinner pic.twitter.com/K8GGCTqdnU
— Geniuss Munnu (@geniussmunnu) September 29, 2024
కెప్టెన్సీ మార్పు, స్టార్ ఆటగాళ్ల వైఫల్యం కారణంగా ముంబై దారుణంగా విఫలమైంది. దాంతో యాజమాన్యం కొందరి పట్ల కఠినంగానే వ్యవహరించాలనే నిర్ణయం తీసుకుందని జడేజా అంటున్నాడు. అందుకని ఈసారి మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఓపెనర్ ఇషాన్ కిషన్(Ishan Kishan)లను ముంబై రిటైన్ చేసుకుంటుందని, హార్దిక్ పాండ్యా కోసం రైట్ టు మ్యాచ్ (RTM) విధానాన్ని ఎంచుకుంటుందని ఈ మాజీ ఆటగాడు తెలిపాడు.
ఇక మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ సైతం జట్టులో భారీ మార్పులు చేయనుందని అజయ్ జడేజా చెప్పాడు. సీఎస్కే యాజమాన్యం ఈసారి మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni), ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌లను అట్టిపెట్టుకుంటుందని జడేజా అన్నాడు. ఈ ముగ్గురు చెన్నై జట్టు కూర్పులో చక్కగా సరిపోతారని.. యువ పేసర్ మథీశ పథరణను యాజమాన్యం వదులుకోకపోవచ్చని అతడు తెలిపాడు.
Ajay Jadeja announces his 4 retentions for Chennai Super Kings ahead of IPL 2025 mega auctionhttps://t.co/vXNCNRLZ4g pic.twitter.com/Gq5trHsCHP
— Sports Tak (@sports_tak) September 29, 2024
టీమిండియా మాజీ పేసర్ ఆర్పీ సింగ్ (RP Singh) సైతం రిటెన్షన్‌పై స్పందించాడు. ఈసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టులో మాజీ సారథి విరాట్ కోహ్లీ (Virat Kohli) ఒక్కడే మిగులుతాడని.. కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్, ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ సహా ఏ ఒక్కరిని ఆర్సీబీ అట్టిపెట్టుకోదని సింగ్ తెలిపాడు.
17 సీజన్లలో మూడు సార్లు ఫైనల్ చేరినా ట్రోఫీని ముద్దాడలేకపోయిన బెంగళూరు స్క్వాడ్‌లో భారీ మార్పులు చేయాలని యాజమాన్యం భావించడమే అందుకు కారణమని వివరించాడు. అందుకనే 18వ సీజన్లో కొత్తవాళ్లతో టీమ్‌ను నింపేయాలని ఆర్బీబీ అనుకుంటోందట.
ఐపీఎల్ 18వ సీజన్‌కు ముందే మెగా వేలం జరుగనుంది. ఈ ఏడాది నవంబర్ చివర్లో లేదా డిసెంబర్ మొదటి వారంలో వేలం ప్రక్రియను నిర్వహించనున్నారు. ఈసారి కూడా విదేశాల్లోనే ఆక్షన్ జరుగనుదని సమాచారం. యునైటె అరబ్ ఎమిరేట్స్‌లో వేలం జరుగుందని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి.