Tripti Dimri | యానిమల్ సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ డమ్ సంపాదించింది ఉత్తారఖండ్ భామ తృప్తి డిమ్రి (Tripti Dimri). హాట్ హాట్‌గా అందాలు ఆరబోస్తూ టాక్ ఆఫ్ ది గ్లోబల్ ఇండస్ట్రీగా నిలిచింది. ఇటీవలే బ్యాడ్ న్యూజ్ సినిమాతో మరో హిట్‌ను ఖాతాలో వేసుకుంది. బడా దర్శకనిర్మాతలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ మరో భారీ ప్రాజెక్ట్‌కు సంతకం చేసిందన్న వార్త ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
యానిమల్ బ్యూటీ బాలీవుడ్ లెజెండరీ హీరోయిన్ మాధురీ దీక్షిత్ (Madhuri Dixit) తో సినిమా చేసేందుకు సైన్ చేసిందని బీటౌన్ సర్కిల్ సమాచారం. ఈ చిత్రాన్ని జల్సా అండ్ తుమ్హారీ సులు ఫేం విక్రమ్ మల్హోత్రా డైరెక్ట్ చేయబోతున్నాడు. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో ఉండబోతున్న ఈ చిత్రంలో మాధురీ దీక్షిత్ తృప్తి డిమ్రి తల్లి పాత్రలో కనిపించనుందట. ఈ ఏడాది చివరలో షూటింగ్ షురూ కానుండగా.. 2025 వేసవి కానుగా విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టు ఇన్సైడ్ టాక్.
మొత్తానికి వరుస సినిమా సక్సెస్‌లతో జోష్ మీదున్న యానిమల్ భామ ఏదో ఒక అప్డేట్ అందిస్తూ అభిమానులు, ఫాలోవర్లు, మూవీ లవర్స్‌ను ఖుషీ చేస్తోంది.
Zebra | సత్యదేవ్‌కు సపోర్ట్‌గా నాని.. జీబ్రా టీజర్ టైం చెప్పేశారు
Bhaagamathie 2 | భాగమతి మళ్లీ వచ్చేస్తుంది.. అనుష్క భాగమతి 2పై డైరెక్టర్ అశోక్ క్లారిటీ
Bipasha Basu | బిపాషా బసు బాయ్ ఫ్రెండ్ కోసం శాఖాహారిగా మారిందట..!
Devara Review | దేవర మూవీ రివ్యూ: ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ కొట్టాడా? లేదా ?