Bhaagamathie 2 | అరుంధతి సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసింది బెంగళూరు భామ అనుష్కాశెట్టి (Anushka Shetty). ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించింది. ఈ బ్యూటీ హార్రర్ థ్రిల్లర్ జోనర్లో నటించిన మరో చిత్రం భాగమతి (Bhaagamathie). అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిన భాగమతి 2018లో విడుదలైంది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇందులో ఘోస్ట్‌గా, ఐఏఎస్ అధికారిగా రెండు పాత్రల్లో నటించింది స్వీటీ.
ఈ సినిమాకు సీక్వెల్ (Bhaagamathie 2) ఉండబోతుందంటూ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ హింట్ ఇవ్వడంతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగిపోయింది. లాంగ్ గ్యాప్ తర్వాత సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చాడు అశోక్. నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ అశోక్ మాట్లాడుతూ.. భాగమతి సీక్వెల్లో అనుష్క మరింత ఆసక్తికరమైన, పవర్ఫుల్ రోల్లో కనిపించనుందని చెప్పాడు.
అంతేకాదు ప్రీ ప్రొడక్షన్ పనులు జెట్‌స్పీడ్‌లో కొనసాగుతున్నాయని.. ఈ సినిమా 2025లో సెట్స్‌పైకి వెళ్తుందని చెప్పాడు. ఈ చిత్రం యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కనుంది. అనుష్క మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై మళ్లీ తన యాక్టింగ్‌తో అందరికీ గూస్ బంప్స్ తెప్పించేందుకు రెడీ అవుతుందన్న వార్తను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అభిమానులు, ఫాలోవర్లు. గతేడాది మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది అనుష్క. ప్రస్తుతం క్రిష్ తెరకెక్కిస్తున్న ఘాటి సినిమాతోపాటు మాలీవుడ్ ఎంట్రీ ప్రాజెక్ట్ Kathanar – The Wild Sorcerer చిత్రంలో నటిస్తోంది.
Devara Review | దేవర మూవీ రివ్యూ: ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ కొట్టాడా? లేదా ?
Prakash Raj | గెలిచే ముందొకటి.. గెలిచిన తర్వాత ఇంకోటి.. పవన్ కల్యాణ్‌పై ప్రకాశ్‌రాజ్ ఫైర్