Prakash Raj | తిరుమల లడ్డూ వివాదం వ్యవహారంలో సినీ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj), ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (pawan kalyan) మధ్య డైలాగ్ వార్ హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. మీరు ఉపముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది. మీరెందుకు ఈ విషయాన్ని జాతీయ స్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారు. దీనిపై విచారించి నేరస్తులపై చర్యలు తీసుకోండని ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేయగా.. ఈ వ్యవహారంతో ప్రకాశ్ రాజ్‌కు సంబంధమేంటని మరోవైపు ఇప్పటికే పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు.
పవన్ కల్యాణ్ కామెంట్స్‌పై ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ.. తాను విదేశాల్లో షూటింగ్ ఉన్నా. పవన్ కల్యాణ్‌కు వీలైతే తన ట్వీట్‌ను మళ్లీ చదివి.. దయచేసి అర్థం చేసుకోవాలని కోరాడు. ఈ నెల 30న వచ్చి మీ ప్రతీ మాటకు సమాధానం చెబుతానన్నాడు. ఆ తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి.. చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో.. అంటూ జస్ట్ ఆస్కింగ్ హ్యాష్ ట్యాగ్‌ను కూడా జోడించాడు ప్రకాశ్ రాజ్.
తాజాగా మరో ట్వీట్ చేసి హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాడు ప్రకాశ్‌రాజ్. గెలిచే ముందు ఒక అవతారం.. గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటీ అవాంతరం.. ఎందుకు మనకీ అయోమయం.. ఏది నిజం..? జస్ట్ ఆస్కింగ్..? అంటూ మరో ట్వీట్ చేశాడు. తాజా కామెంట్స్ కూడా పవన్ కల్యాణ్‌నుద్దేశించి అంటున్నట్టు అర్తమవుతుండగా.. మరి దీనిపై పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారనేది చూడాలి.
ప్రకాశ్ రాజ్ ట్వీట్ …
గెలిచేముందు ఒక అవతారం… గెలిచిన తర్వాత ఇంకో అవతారం..
ఏంటీ అవాంతరం.. ఏందుకు మనకీ అయోమయం… ఏది నిజం?
జస్ట్ ఆస్కింగ్? #justasking— Prakash Raj (@prakashraaj) September 26, 2024
చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో! జస్ట్ ఆస్కింగ్… #justasking
— Prakash Raj (@prakashraaj) September 25, 2024
Dear @PawanKalyan garu..i saw your press meet.. what i have said and what you have misinterpreted is surprising.. im shooting abroad. Will come back to reply your questions.. meanwhile i would appreciate if you can go through my tweet earlier and understand #justasking pic.twitter.com/zP3Z5EfqDa
— Prakash Raj (@prakashraaj) September 24, 2024
Hanu Man | బాహుబలి, ఆర్ఆర్ఆర్ రూట్లో తేజ సజ్జా హనుమాన్.. ప్రశాంత్ వర్మ కొత్త పోస్టర్ వైరల్
C Kalyan | పోక్సో కేసు వర్తిస్తుందా..? జానీ మాస్టర్ వివాదంపై నిర్మాత సీ కల్యాణ్
Prakash Raj | చేయని తప్పుకి సారీ.. హాట్ టాపిక్‌గా ప్రకాశ్ రాజ్ మరో ట్వీట్