Pushpa 2 The Rule | టాలీవుడ్ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్ (Allu arjun) నటిస్తున్న సీక్వెల్ ప్రాజెక్ట్ పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule). సుకుమార్ (sukumar) దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ , అండ్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్నారు. పుష్ప పార్ట్ 1కు సీక్వెల్‌గా వస్తోన్న ఈ మూవీని డిసెంబరు 6న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారని తెలిసిందే.
తాజాగా ఈ మూవీ క్లైమాక్స్‌కు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఫస్ట్ పార్ట్‌లో ఫహద్ ఫాసిల్, అల్లు అర్జున్‌కు మధ్య వచ్చే సన్నివేశాలు ఇంట్రెస్టింగా ఉంటాయని తెలిసిందే. సీక్వెల్లో కూడా క్లైమాక్స్ పార్ట్ సూపర్ స్పెషల్‌గా ఉండబోతుందట. తాజా టాక్ ప్రకారం ఫస్ట్ పార్ట్‌ను మించిపోయేలా క్లైమాక్స్‌లో బన్నీ, ఫహద్ ఫాసిల్ మధ్య సూపర్ డైలాగ్ వార్తో సాగే సన్నివేశాలు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లబోతున్నాయన్న వార్త ఒకటి ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
ఈ చిత్రంలో కన్నడ సోయగం రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. మాలీవుడ్ స్టార్ యాక్టర్ ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అనసూయ, సునీల్, రావు రమేశ్ ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మరోసారి అదిరిపోయే ఆల్బమ్‌ను రెడీ చేశాడని ఇప్పటికే విడుదల చేసిన రెండు పాటలు చెప్పకనే చెబుతున్నాయి.
Devara Movie | ‘దేవర’ టికెట్ ధరలు.. నిర్మాతలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భారీ షాక్.!
Mohan Babu | మోహన్ బాబు ఇంట్లో చోరీ.. రూ.10 లక్షలతో ఉడాయించిన పనిమనిషి
Rathnavelu | దేవరలో జాన్వీకపూర్ కనిపించేది అప్పుడేనట.. రత్నవేలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Jr NTR | దేవర క్రేజ్.. తొలి భారతీయ హీరోగా తారక్ అరుదైన ఫీట్