కాఠ్మాండూ, మార్చి 7: నేపాల్ సాధారణ ఎన్నికల్లో బాలేంద్ర షా నేతృత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) పూర్తి విజయం సాధించి అధికారం వైపు అడుగులు వేస్తున్నది. మొత్తం 165 నియోజకవర్గాల్లో బాలేంద్ర షా పార్టీ 67 స్థానాల్లో విజయం సాధించగా, 55 సీట్లలో ఆధిక్యంలో ఉంది.
దీంతో 35 ఏండ్ల బాలెన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. సెప్టెంబర్లో జెన్ జీ(యువత) నిరసనల అనంతరం నేపాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో నాలుగుసార్లు ప్రధానిగా పనిచేసిన కేపీ శర్మ ఓలీని, ఇతర పార్టీలను బాలేంద్ర పూర్తిగా తుడిచిపెట్టేసారు. ఈ ఎన్నికల్లో మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ జాపా-5 నియోజకవర్గంలో చిత్తుగా ఓటమి పాలయ్యారు.