తుంగతుర్తి, జూలై 23 : తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి మాతృమూర్తి కుంచాల కౌసల్య ఇటీవల మరణించింది. గురువారం మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన రిటైర్ ఆర్టీసీ డ్రైవర్ బొంకూరి భిక్షం అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మరణించడంతో ఆయన కుటుంబాన్ని పరమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు తాటికొండ సీతయ్య, గుండెగాని రాములు గౌడ్, పులుసు యాదగిరి, మట్టిపల్లి శ్రీశైలం, దొంగరి శ్రీనివాస్, తునికి సాయిలు, గోపాల్ రెడ్డి, తడకమళ్ల రవికుమార్, గునిగంటి సంతోష్, గొపగాని రమేష్, శ్రీను, శ్యాంసుందర్, మల్లేష్, కిరణ్, వెంకటే, సురేష్, మధు, మల్లికార్జున్, రాజశేఖర్, సాయి, గోపి పాల్గొన్నారు.

పలు కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ పరామర్శ

పలు కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ పరామర్శ