Mohan Babu | టాలీవుడ్ సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు (Mohan Babu) ఇంట్లో చోరీ (Theft) జరిగింది. జల్పల్లి (Jal Pally)లోని మోహన్ బాబు నివాసంలో పనిచేస్తున్న నాయన్ రూ.10 లక్షలతో పారిపోయారు. ఈ విషయంపై మోహన్ బాబు మంగళవారం రాత్రి రాచకొండ సీపీకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న రాచకొండ పోలీసులు.. నాయక్ కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే అతడిని తిరుపతిలో అదులోకి తీసుకున్నట్లు తెలిసింది.
మంచు ఫ్యామిలీ నుంచి వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కన్నప్ప (Kannappa). దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నిర్మిస్తుండగా.. ఆయన కుమారుడు మంచు విష్ణు (Manchu Vishnu) కథానాయకుడిగా నటిస్తున్నాడు. హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ అగ్ర తారలు నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్‌కుమార్ సింగ్ (Mukesh Kumar Singh) దర్శకత్వం వహిస్తున్నాడు.
Also Read..
JK elections | ఓటేసిన 102 సంవత్సరాల వృద్ధుడు.. ఆయన ఏమన్నాడంటే.. Video
CP Joshi | రాహుల్‌గాంధీ పాస్‌పోర్టును రద్దు చేయండి.. లోక్‌సభ స్పీకర్‌కు బీజేపీ ఎంపీ లేఖ
Gujarat | గుజరాత్లో ఘోర ప్రమాదం.. ఏడుగురు మృతి