Gujarat | అహ్మదాబాద్ : గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సబర్కాంతా జిల్లాలోని హిమ్మత్ నగర్ వద్ద కారు – లారీ ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదానికి అతి వేగమే కారణమని పోలీసులు నిర్ధారించారు. కారు పూర్తిగా ధ్వంసంమైంది. కారు శ్యామలజీ నుంచి అహ్మదాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
#WATCH | Sabarkantha, Gujarat | A car collided with a heavy vehicle in Himmatnagar. The police and fire department present at the spot. Injuries and casualties feared. More details awaited. pic.twitter.com/kHGz5tkl30
— ANI (@ANI) September 25, 2024
ఇవి కూడా చదవండి..
Musi Development | మూసీ నిర్వాసితులకు డబుల్ ఇండ్లు.. 16 వేల గృహాలు కేటాయిస్తూ సర్కార్ ఉత్తర్వులు
Bathukamma Sarees | బతుకమ్మ చీరలు బంద్.. ఆవేదన వ్యక్తం చేస్తున్న తెలంగాణ ఆడబిడ్డలు