CP Joshi : కాంగ్రెస్ అగ్ర నాయకుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) ఇటీవల ఆమెరికా పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ సీపీ జోషి (CP Joshi) మరోసారి మండిపడ్డారు. పరాయి దేశంలో అనుచిత వ్యాఖ్యలతో జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన రాహుల్‌గాంధీ పాస్‌పోర్టును రద్దు చేయాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్ (Lok Sabha speaker) ఓం బిర్లా (Om Birla) కు లేఖ రాశారు.
రాహుల్‌గాంధీ తన హోదాను దుర్వినియోగం చేశారని, అందుకుగాను ఆయన తక్షణమే ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయాలని స్పీకర్‌కు రాసిన లేఖలో చిత్తోర్‌గఢ్ పేర్కొన్నారు. ఈ నెల ఆరంభంలో రాహుల్‌గాంధీ నాలుగు రోజులపాటు ఆమెరికాలో పర్యటించారు. ఈ అనధికారిక పర్యటన సందర్భంగా రాహుల్‌గాంధీ యూనివర్సిటీ విద్యార్థులతో, భారత సంతతి అమెరికన్లతో సమావేశమయ్యారు.
ఆ సమావేశంలో రాహుల్‌గాంధీ దేశంలోని నిరుద్యోగం అంశాన్ని ప్రస్తావించారు. బీజేపీ మాతృసంస్థ అయిన ఆర్ఎస్ఎస్పై విమర్శలు చేశారు. భారత ప్రజాస్వామ్యంలో తానొక బ్లాక్ స్పాట్‌ను అని చెప్పుకున్నారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ, దాని ప్రధాన మిత్రపక్షం టీడీపీ మండిపడ్డాయి. రాహుల్‌గాంధీ వ్యాఖ్యలు చైనాను ప్రమోట్ చేసేలా ఉన్నాయని విమర్శించారు. విదేశాల్లో భారత్‌ను తక్కువ చేసేలా ఉన్నాయన్నారు.