JK elections | ఓటేసిన 102 సంవత్సరాల వృద్ధుడు.. ఆయన ఏమన్నాడంటే.. Video
JK elections | జమ్ముకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ జోరుగా సాగుతోంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర పెద్ద ఎత్తున బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం ఏడు గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.
JK elections : జమ్ముకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ జోరుగా సాగుతోంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర పెద్ద ఎత్తున బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం ఏడు గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఓటు వేసేందుకు యువత, వృద్ధులు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. దాంతో ఏ పోలింగ్ కేంద్రంలో చూసినా చేంతాడంత క్యూలు దర్శనమిస్తున్నాయి.
రియాసిలోని ఓ పోలింగ్ కేంద్రంలో 102 ఏళ్ల వృద్ధుడు హగీ కరీమ్ దిన్ భట్ (Hagi Karam Din Bhat) తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటేసిన అనంతరం పోలింగ్ కేంద్రం ఆవరణలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే అభివృద్ధి పనులు బాగా జరుగుతాయని అన్నారు. పిల్లలకు మంచి విద్య లభిస్తుందని చెప్పారు. వ్యాపారాలు మెరుగుపడుతాయన్నారు.
#WATCH | J&K: Hagi Karam Din Bhat, who says he is 102 years old, casts his vote for the second phase of Assembly elections at a polling centre in Reasi.
He says, “If a good government is formed a lot of work will be done…The youth should get a good education, businesses… pic.twitter.com/pWfZ1aRxGN
— ANI (@ANI) September 25, 2024
కాగా జమ్ముకశ్మీర్లోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 18న తొలి విడత పోలింగ్ పూర్తయ్యింది. తొలి విడతలో 24 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇవాళ రెండో విడత పోలింగ్ జరుగుతోంది. రెండో విడతలో 26 స్థానాలకు నిర్వహిస్తున్నారు. ఇక మిగిలిన 40 స్థానాలకు అక్టోబర్ 1న మూడో విడత పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 8న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడిస్తారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

