తుంగతుర్తి, ఆగస్టు 14 : రాష్ట్రంలోని ఆడబిడ్డల పెళ్లిలకు ఇస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసేందుకు కుట్ర చేస్తుందని బీఆర్ఎస్ తుంగతుర్తి మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని బండ రామారం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు రాష్ట్రంలోని ఆడబిడ్డలకు ఇచ్చే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకంలో అదనంగా తులం బంగారం ఇస్తామని చెప్పి మహిళలను మోసం చేసి ఓట్లు దండుకుని అధికారానికి వచ్చిందని ఆరోపించారు. హైకోర్టు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకలపై స్టే విధించడం ముమ్మాటికి రేవంత్ రెడ్డి సర్కార్ అసమర్ధతకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలోని మహిళా లోకానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని, లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వార్డు సభ్యురాలు కోటమర్తి ప్రేమలత, మహిళా నాయకురాలు మంగమ్మ, సుగుణమ్మ, ఎల్లమ్మ, నర్సమ్మ,ఫాతిమా, లక్సమమ్మ, ప్రమీల, నర్సమ్మ, తాటికొండ సోమలక్ష్మీ, బీఆర్ఎస్ నాయకులు కొల్లూరి లింగయ్య, మర్రి భిక్షం పాల్గొన్నారు.