Acid Reflux | యాసిడ్ రిఫ్లక్స్ సమస్యను తగ్గించుకునేందుకు నిపుణులు సూచించిన నాచురల్ టిప్స్ ఇవిగో..
యాసిడ్ రిఫ్లక్స్ సమస్య ప్రస్తుతం చాలా మందిని ఇబ్బంది పెడుతోంది. వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్య అందరిలోనూ కనిపిస్తోంది. పొట్టలోని ఆమ్లం తిరిగి నోటి నుంచి జీర్ణాశయానికి ఆహారం చేరే గొట్టమైన అన్నవాహికలోకి ప్రవహించినప్పుడు యాసిడ్ రిఫ్లక్స్ ఏర్పడుతుంది. దీనివల్ల ఛాతీలో మంట, అసౌకర్యం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
Acid Reflux | యాసిడ్ రిఫ్లక్స్ సమస్య ప్రస్తుతం చాలా మందిని ఇబ్బంది పెడుతోంది. వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్య అందరిలోనూ కనిపిస్తోంది. పొట్టలోని ఆమ్లం తిరిగి నోటి నుంచి జీర్ణాశయానికి ఆహారం చేరే గొట్టమైన అన్నవాహికలోకి ప్రవహించినప్పుడు యాసిడ్ రిఫ్లక్స్ ఏర్పడుతుంది. దీనివల్ల ఛాతీలో మంట, అసౌకర్యం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమస్య తరచూ కొనసాగితే అన్నవాహికపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున, పదేపదే వచ్చే లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. ఆహారపు అలవాట్లు, కొన్ని రకాల ఆహార పదార్థాలు, జీవనశైలి వంటి అంశాలు కొంతమందిలో యాసిడ్ రిఫ్లక్స్‌ను ప్రేరేపిస్తాయి.
చూయింగ్ గమ్..
యాసిడ్ రిఫ్లక్స్‌ను నియంత్రించుకోవడానికి భోజనం తర్వాత పుదీనా లేని చక్కెర రహిత చూయింగ్‌గమ్‌ను నమలడం ఒక మార్గంగా సూచిస్తున్నారు. చూయింగ్‌గమ్ నమలడం వల్ల తరచూ మింగడం జరుగుతుంది. దీంతో అన్నవాహికలోని ఆమ్లం త్వరగా కిందికి వెళ్లేందుకు సహాయపడుతుంది. అయితే పుదీనా కలిగిన చూయింగ్‌గమ్‌ను నివారించాలని సూచిస్తున్నారు. అలాగే భోజనం తర్వాత కనీసం 10 నిమిషాలు నడవడం, ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత నడవడం కూడా రిఫ్లక్స్ సమస్యను తగ్గించడంలో సహాయపడతాయి. ఆహారంలో శుద్ధి చేసిన కార్బొహైడ్రేట్లు, చక్కెరను తగ్గించుకోవడంపైనా దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.
పడుకునే విధానంలో మార్పులు..
రాత్రివేళ యాసిడ్ రిఫ్లక్స్ సమస్యను తగ్గించుకోవడానికి పడుకునే విధానంలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. మంచం తల భాగాన్ని సుమారు 6 నుంచి 8 ఇంచుల వరకు ఎత్తుగా ఉంచడం వల్ల రాత్రి సమయంలో అన్నవాహికపై ఆమ్లం ప్రభావం పడే సమయం తగ్గే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. అలాగే పడుకునే సమయానికి 2 నుంచి 3 గంటల ముందే భోజనం ముగించాలి. ఆలస్యంగా భోజనం చేయడం వల్ల రాత్రి సమయంలో ఆమ్లం అన్నవాహికపై ఎక్కువసేపు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
ఎడమ వైపు తిరిగి నిద్రిస్తే..
నిద్రపోయేటప్పుడు ఎడమవైపు తిరిగి పడుకోవడం కూడా యాసిడ్ రిఫ్లక్స్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే మరో మార్గంగా సూచిస్తున్నారు. వెనుకకు లేదా కుడివైపు పడుకోవడంతో పోలిస్తే ఎడమవైపు పడుకున్నప్పుడు కడుపులోని ఆమ్లం త్వరగా కిందికి వెళ్లి, అన్నవాహికపై ఆమ్లం ప్రభావం పడే సమయం తగ్గుతుందని చెబుతున్నారు. భోజనాన్ని జాగ్రత్తగా తీసుకోవడం, నిద్రకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ద్వారా యాసిడ్ రిఫ్లక్స్ సమస్యను తగ్గించుకోవడానికి ప్రయత్నించవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

