జూలూరుపాడు, ఆగస్టు 14 : ప్రజల సమస్యలను స్థానిక స్థాయిలోనే త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రతి సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జూలూరుపాడు ఎంపీడీవో తాళ్లూరి రవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు. ప్రజలు తమ సమస్యలు, విజ్ఞప్తులపై నేరుగా దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపారు. మండల స్థాయి అధికారులు అందరూ నిర్ణీత సమయానికి తప్పనిసరిగా హాజరై, ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పారదర్శకమైన, బాధ్యతాయుతమైన పాలన అందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో కోరారు.