BTPS | బీటీపీఎస్ యూనిట్-1 షట్డౌన్.. 270 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి బ్రేక్
BTPS | రాష్ట్రంలో జెన్కోకు చెందిన విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు వరుసగా షట్డౌన్ అవుతున్నాయి. ఒకదాని వెంట మరొకటి మూతబడుతున్నాయి. తాజాగా భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్)లోని యూనిట్ -1లో అకస్మాత్తుగా విద్యుత్తు ఉత్పత్తి నిలిచిపోయింది.
BTPS | హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో జెన్కోకు చెందిన విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు వరుసగా షట్డౌన్ అవుతున్నాయి. ఒకదాని వెంట మరొకటి మూతబడుతున్నాయి. తాజాగా భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్)లోని యూనిట్ -1లో అకస్మాత్తుగా విద్యుత్తు ఉత్పత్తి నిలిచిపోయింది. బాయిలర్ ట్యూబ్ లీక్ కావడంతో ఈ యూనిట్లోని 270 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి నిలిచిపోయింది. ఇదే ప్లాంట్లోని యూనిట్ -3 ఈ నెల 9వ తేదీ నుంచి నడువడంలేదు. ఈ ప్లాంట్లో నాలుగు యూనిట్లు ఉండగా, ప్రస్తుతం రెండు యూనిట్లు మూతపడ్డాయి.
బీటీపీఎస్ యూనిట్ -1లో రోజుకు సగటున 22 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి కావాల్సి ఉండగా గురువారం షట్డౌన్ కారణంగా కేవలం 0. 18 మిలియన్ యూనిట్లు మాత్రమే ఉత్పత్తి అయ్యింది. జెన్కో విద్యుత్తు ఉత్పత్తి ప్లాంట్లల్లో వైటీపీఎస్లోని 800 మెగావాట్ల యూనిట్ -3 ఈ నెల 20వ తేదీ నుంచి నడువడంలేదు. ఒక యూనిట్లో అంతరాయం తలెత్తగా, ఉత్పత్తి పున ః ప్రారంభమయ్యింది. హైడల్లో నిజాంసాగర్, నాగార్జునసాగర్ యూనిట్ -3లు కూడా నడువడంలేదు. శ్రీశైలంలో ఒక యూనిట్ షట్డౌన్ కాగా, మరమ్మతులు చేసి ఉత్పత్తిని పునరుద్ధరించారు. గురువారం హైడల్ విద్యుత్తు ఉత్పత్తి ఏకంగా 3.922 మిలియన్ యూనిట్లకు పడిపోయింది. వారం రోజుల నుంచి 10-7 మిలియన్ యూనిట్ల మధ్య జల విద్యుత్తు ఉత్పత్తి అవుతుండగా, ఏకంగా 3 మిలియన్ యూనిట్లకు తగ్గింది.
వినియోగం 245 ఎంయూలు
రాష్ట్రంలో విద్యుత్తు వినియోగం 245 మిలియన్ యూనిట్లుగా (ఎంయూ) నమోదయ్యింది. ఈ నెల 17న 304 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగం కాగా, గురువారానికి 245 ఎంయూలకు పడిపోయింది. పీక్ డిమాండ్ కూడా అమాంతం తగ్గింది. ఈ నెల 17న విద్యుత్తు గరిష్ఠ డిమాండ్ 18,103 మెగావాట్లుండగా, గురువారానికి 12,891 మెగావాట్లకు తగ్గింది. బుధవారం 16,183 మెగావాట్లున్న పీక్ డిమాండ్ అమాంతం నాలుగువేలు తగ్గింది. అయితే బుధ, గురువారాల్లో వర్షాలు పడటంతో వినియోగం, పీక్ డిమాండ్ తగ్గాయి. దీంతో విద్యుత్తు సంస్థల అధికారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

