Teachers | 72 మంది విద్యార్థులకు ఒక్కరే టీచర్.. ఎనిమిది తరగతులకు ఐదుగురే..!
Teachers | రాష్ట్రంలో టీచర్లు ఎక్కువగా ఉన్నారు. ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి 17 మాత్రమే. మిగులు టీచర్లను సర్దుబాటు చేస్తున్నాం. ఇదీ పాఠశాల విద్యాశాఖ తరచూ చెప్తున్న ముచ్చట. కానీ, రాష్ట్రంలోని కొన్ని సర్కార్ బడుల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉన్నది.
Teachers | హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో టీచర్లు ఎక్కువగా ఉన్నారు. ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి 17 మాత్రమే. మిగులు టీచర్లను సర్దుబాటు చేస్తున్నాం. ఇదీ పాఠశాల విద్యాశాఖ తరచూ చెప్తున్న ముచ్చట. కానీ, రాష్ట్రంలోని కొన్ని సర్కార్ బడుల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉన్నది. అనేక స్కూళ్లల్లో విద్యార్థులున్నా టీచర్లు లేరు. ఓ స్కూల్లో 72 మంది విద్యార్థులకు ఒకే టీచర్, 250 మంది విద్యార్థులకు ఐదుగురు టీచర్లే.. 1-8 తరగతుల పిలల్లకు బోధించేందుకు ఉపాధ్యాయులు ఐదుగురు మాత్రమే ఉన్నారని, దీంతో బోధన కుంటుపడుతున్నదని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లను నియమించకుండా, ఉన్నవారిపైనే భారం మోపుతున్నారని మండిపడుతున్నారు.
కొలిక్కిరాని సర్దుబాట్లు..
అయితే, కొన్ని సర్కార్ బడుల్లో ఆరుగురు, ఏడుగురు విద్యార్థులకే ఇద్దరు టీచర్లూ ఉండటం గమనార్హం. ఒక విద్యార్థికే ఒక టీచర్ ఉన్న పాఠశాలలూ ఉన్నట్టు సమాచారం. అయితే, మిగులు టీచర్ల సర్దుబాటు ప్రక్రియను విద్యాశాఖ చేపట్టింది. కానీ, ఇది కొలిక్కి రాలేదు. అనేక జిల్లాల్లో ఇష్టారీతిగా సర్దుబాట్లు జరిగాయి. పిల్లలులేకుండా టీచర్లున్న స్కూళ్లు ఇంకా ఉన్నాయి. ఇదేకాకుండా బోధనతోపాటు బోధనేతర బాధ్యతలతో టీచర్లకు తలనొప్పులు తప్పడంలేదని వాపోతున్నారు. రాష్ట్రంలో 5వేలకు పైగా సింగిల్ టీచర్ స్కూళ్లున్నాయి. వీటిలో ఒకే ఉపాధ్యాయుడు బహుళ తరగతుల బోధన చేయాల్సిన పరిస్థితి ఉన్నట్టు చెప్తున్నారు. పలు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు తగినంత టీచర్లు లేరని ఎస్జీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు కే మహిపాల్‌రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు కొన్ని ఉదాహరణలు ప్రస్తావించారు.
జీవో-25ను పునఃపరిశీలించాలి : ఎస్జీటీయూ
సర్కార్ బడుల్లో టీచర్లపై బోధనతోపాటు అనేక బోధనేతర బాధ్యతలు పెరిగాయని ఉపాధ్యాయ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఒక టీచర్ ఉంటే 1-5 తరగతల వరకు రోజుకు 18 సబ్జెక్టులను బోధించాల్సి వస్తున్నదని వాపోతున్నారు. ఆన్లైన్ పనులు, రికార్డుల నిర్వహణ, మధ్యాహ్న భోజనం, బ్రేక్‌ఫాస్ట్, సమావేశాలు, నివేదికలు, తనిఖీలతో బోధనకు తగిన సమయం ఉండటం లేదని చెప్తున్నారు. ‘ఉపాధ్యాయుల సర్దుబాటు కోసం జారీచేసిన జీవో-25ను పునఃపరిశీలించాలి. విద్యార్థులు అధికంగా ఉన్న పాఠశాలల్లో అదనపు ఉపాధ్యాయులు, అవసరమైతే వలంటీర్లను నియమించాలి’ అని ఎస్జీటీయూ డిమాండ్ చేస్తున్నది. జీవో-25ను సవరించాలని, ఎఫ్ఎల్ఎన్ స్కూళ్లల్లో సబ్జెక్టుకు ఒక టీచర్‌ను కేటాయించాలన్న డిమాండ్‌తో ఎస్జీటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం కూడా నిరసనలు కొనసాగినట్టు మహిపాల్‌రెడ్డి తెలిపారు.

Teacher
ఇదీ పలు స్కూళ్లలో పరిస్థితి..
- జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలం అరిగిద్ద పీఎస్‌లో 377 మందికి ఆరుగురు టీచర్లు, ఒక వలంటీర్ మాత్రమే పనిచేస్తున్నారు.
- గట్టు మండలం అలూరు ప్రాథమిక పాఠశాలలో 330 మంది విద్యార్థులకు ఆరుగురు ఉపాధ్యాయులే ఉన్నారు.
- కేశవరం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో 220 మందికి నలుగురు టీచర్లు, ఒక వలంటీర్ పనిచేస్తున్నారు.
- మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఇరికిచేడులో 253మంది విద్యార్థులకు ప్రస్తుతం ఇద్దరు టీచర్లు మాత్రమే పనిచేస్తున్నారు.
- మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల తుమ్మిళ్లలో 250 మంది విద్యార్థులకు ఐదుగురు టీచర్లే పనిచేస్తున్నారు.
- మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల రంగాపూర్‌లో 110 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే పనిచేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Explosion In Building | నిర్మాణంలో ఉన్న భవనంలో పేలుడు.. ఐఈడీగా పోలీసులు అనుమానం
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో లోయలో పడ్డ బస్సు.. ఇద్దరు మృతి.. 15 మందికి గాయాలు
Telangana RTC Union Elections | తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఈయూ ఘన విజయం
Ramayana | ‘రామాయణం’ మూవీకి ‘యూ’ సర్టిఫికెట్.. రన్‌టైమ్ ఎంతంటే?
Vijayadashami Celebrations | తోడసం వంశస్తుల ఆధ్వర్యంలో ఘనంగా విజయదశమి వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

