Rathnavelu | గ్లోబర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం దేవర (Devara). కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రెండు పార్టులుగా తెరకెక్కుతుంది. జాన్వీకపూర్ ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. దేవర పార్టు 1 సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తారక్ దేవర టీం ఇప్పటికే ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది.కాగా ఈ సినిమాకు పాపులర్ టెక్నీషియన్ రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడని తెలిసిందే. ప్రమోషన్స్‌లో భాగంగా ఓ చిట్ చాట్‌లో దేవర గురించి ఆసక్తిక విషయాలు షేర్ చేసుకున్నాడు రత్నవేలు.
మనమంతా తెలుగు సినిమాలో మరోసారి శ్రీదేవిని చూస్తాం. జాన్వీకపూర్ ఫస్ట్ హాఫ్‌లో కనిపించదు. కేవలం సెకండాఫ్‌లో మాత్రమే వస్తుంది. ఎందుకంటే దర్శకుడు అలాగే కథ రాసుకున్నాడు. అయితే జాన్వీకపూర్‌కు దేవర 2లో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని చెప్పాడు. ఆమె చాలా మంచి యాక్టర్. ఆమెకు మూడు పేజీల డైలాగ్ ఇచ్చినా.. అర్థం తెలుసుకుని బట్టీ పట్టి.. దానికనుగుణంగా నటిస్తుంది. ఎన్టీఆర్ కూడా ఆమె నటన చూసి ఆశ్చర్యపోయాడు. జాన్వీకపూర్ తారక్ డైలాగ్స్ కూడా గుర్తుంచుకుంది. టాలీవుడ్లో ఆమె చాలా ఎత్తుకు ఎదగడం ఖాయమని రత్నవేలు చెప్పుకొచ్చాడు. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అసలెవరు వాళ్లంతా.. కులం లేదు.. మతం లేదు.. భయమే లేదు.. ధైర్యం తప్ప ఏమీ తెలియని కళ్లల్లో మొదటిసారి భయం పొరలు కమ్ముకున్నాయి..చాలా పెద్ద కథ సామి.. రక్తంతో సముద్రమే ఎరుపెక్కిన కథ.. మా దేవర కథ.. అంటూ ట్రైలర్లో సాగుతున్న డైలాగ్స్ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి.
దేవరలో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ భైరగా నటిస్తుండగా.. ప్రకాశ్ రాజ్, మలయాళ యాక్టర్ షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్, మురళీ శర్మ, హిమజ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ, కల్యాణ్ రామ్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
Jani Master | జానీమాస్టర్‌ను కస్టడీకి కోరిన నార్సింగి పోలీసులు..!
Chiranjeevi | నా డ్యాన్స్‌లను ఇష్టపడిన ప్రతీ ఒక్కరికి అంకితం : గిన్నీస్ రికార్డ్‌పై చిరంజీవి
Priyanka Jawalkar | ట్రిప్‌లో స్టైలిష్‌గా ప్రియాంకా జవాల్కర్.. ఇంతకీ ఎక్కడికెళ్లిందో తెలుసా..?
Chiranjeevi | గిన్నీస్ రికార్డ్.. Most Prolific Film Star అవార్డు అందుకున్న చిరంజీవి