Chiranjeevi | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చిరంజీవి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చెరగని స్థానం సంపాదించుకున్నాడని తెలిసిందే. డ్యాన్సుల్లో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్న తొలి నటుడిగా అరుదైన రికార్డు నెలకొల్పిన చిరంజీవి బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ చేతుల మీదుగా చిరంజీవి Most Prolific Film Star (యాక్టర్/డ్యాన్సర్)అవార్డును అందుకున్నాడు. ఈ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న చిరంజీవి తాజాగా సోషల్ మీడియాలో తన సక్సెస్‌లో భాగస్వాములైన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశాడు.
నేనెప్పుడూ ఊహించలేదు. దశాబ్దాలుగా ఇది కేవలం నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలు, డైరెక్టర్ల వల్లే సాధ్యమైంది. అందరూ మ్యూజిక్ డైరెక్టర్లు గొప్ప పాటలను అందించారు. కొరియోగ్రఫర్లు గుర్తుండిపోయే డ్యాన్సింగ్ మూవ్స్ కంపోజ్ చేశారు. ఇన్నేండ్లుగా నా పనిని ప్రశంసిస్తున్న మూవీ లవర్స్ వల్లే ఈ అవకాశం దక్కింది. నా స్నేహితులు, ప్రియమైన అభిమానులు, కుటుంబం, కోస్టార్లు, సినీ ఇండస్ట్రీకి చెందిన పెద్దలు, రాజకీయ, మీడియా ప్రతినిధులు, మీడియా మిత్రులు, గౌరవనీయ మంత్రులు, ప్రజా ప్రతినిధులు, మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్, ఎమ్మెల్యేలతోపాటు ప్రతీ ఒక్కరు ఎల్లప్పుడూ నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలు, ఆశీస్సులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.
ఈ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఘనత.. నాతో సినిమాలు నిర్మించిన నిర్మాతలకి.. నన్ను నడిపించిన దర్శకులకి, అద్భుతమైన పాటలు ఇచ్చిన సంగీత దర్శకులకి, ఇన్ని విభిన్నమైన steps compose చేసిన choreographers కి దక్కుతుంది. నన్ను అమితంగా ప్రేమించి, నా డ్యాన్సులను ఇష్టపడిన ప్రతి ఒక్కరికి ఇది అంకితం.. అంటూ సుదీర్ఘ సందేశాన్ని పోస్ట్ చేశాడు చిరంజీవి.
My heart is filled with gratitude ❤️🙏
The Guinness World Record is something
I had never imagined.This became possible ONLY because of Each one my Producers and Directors who have given me opportunities over the years.
ALL the Music Directors who have composed great songs and…— Chiranjeevi Konidela (@KChiruTweets) September 23, 2024
ఈ Guinnes world record ఘనత,
నాతో చిత్రాలు నిర్మించిన నిర్మాతలకి, నన్ను నడిపించిన దర్శకులకి, అద్భుతమైన పాటలు ఇచ్చిన సంగీత దర్శకులకి, ఇన్ని విభిన్నమైన steps compose చేసిన choreographers కి దక్కుతుంది. నన్ను అమితంగా ప్రేమించి,
నా dances ఇష్టపడిన ప్రతి ఒక్కరికి ఇది అంకితం 🙏🙏 pic.twitter.com/88bzUmquuE— Chiranjeevi Konidela (@KChiruTweets) September 23, 2024
Priyanka Jawalkar | ట్రిప్‌లో స్టైలిష్‌గా ప్రియాంకా జవాల్కర్.. ఇంతకీ ఎక్కడికెళ్లిందో తెలుసా..?
Chiranjeevi | గిన్నీస్ రికార్డ్.. Most Prolific Film Star అవార్డు అందుకున్న చిరంజీవి
Chiranjeevi | డ్యాన్సుల్లో చిరంజీవి అరుదైన ఫీట్.. తొలి యాక్టర్‌గా గిన్నీస్ రికార్డ్
Adivi Sesh | 2025లో మూడు సినిమాలట.. క్యూరియాసిటీ పెంచేస్తున్న అడివిశేష్