Adivi Sesh | కంటెంట్‌ను నమ్మి సినిమాలు చేసే యాక్లర్లలో టాప్‌లో ఉంటాడు టాలీవుడ్ యంగ్ హీరో అడివిశేష్ (Adivi Sesh). ఈ టాలెంటెడ్ యాక్టర్‌కు ఇండియావైడ్‌గా సూపర్ ఫ్యాన్ బేస్ ఉందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అడివిశేష్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే గూఢచారి’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘జీ2’ (G2)లో కూడా నటిస్తున్నాడని తెలిసిందే.
వినయ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘జీ2’ (G2) నుంచి ప్రీ లుక్ పోస్టర్ కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది. మరోవైపు షనీల్ డియో (డెబ్యూడైరెక్టర్) కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్న డెకాయిట్ (Dacoit)లో కూడా నటిస్తున్నాడు. శృతిహాసన్ (Shruti Haasan) హీరోయిన్గా నటిస్తోన్న ఈ మూవీ టైటిల్ టీజర్ ఇప్పటికే సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తోంది.
వీటితోపాటు మూడో ప్రాజెక్ట్ (వివరాలు తెలియాల్సి ఉంది)ను కూడా చేస్తున్నాడు. మూడో సినిమా గురించి అడివిశేష్ 2025లో మూడు సినిమాలు విడుదల అనే ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చేశాడని అర్థమవుతోంది. అడివిశేష్ మూడో ప్రాజెక్ట్ శైలేష్ కొలను డైరెక్షన్లో నాని నటిస్తోన్న హిట్ 3 అయి ఉంటుందా..? ఇందులో ఏమైనా కీ రోల్ చేస్తున్నాడా..? అంటూ తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు. మొత్తానికి అడివిశేష్ వచ్చే ఏడాది వరుస సినిమాలతో ఫాలోవర్లకు ఊపిరాడకుండా చేయాలని గట్టిగానే ఫిక్సయినట్టు తాజా ట్వీట్‌తో అర్థమవుతోంది.
Three Releases. 2025. ❤️🔥
— Adivi Sesh (@AdiviSesh) September 21, 2024
RT75 | ఆర్టీ 75 క్రేజీ న్యూస్.. రవితేజ ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్మెంట్ అప్పుడే..!
Hari Hara Veera Mallu | పవన్ కల్యాణ్‌ను అలా కలిశారో లేదో.. ఇలా హరిహరవీరమల్లు షూట్ షెడ్యూల్
C Kalyan | పోక్సో కేసు వర్తిస్తుందా..? జానీ మాస్టర్ వివాదంపై నిర్మాత సీ కల్యాణ్